తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నీట్​ రద్దు చేసి విద్యార్థులను రక్షించండి: డీఎంకే

నీట్​ పరీక్షలను రద్దు చేయాలని అటు పార్లమెంట్​, ఇటు తమిళనాడు అసెంబ్లీ ఎదుట నిరసన చేపట్టింది డీఎంకే. 'నీట్​ను రద్దు చేయండి, తమిళనాడు విద్యార్థులను రక్షించండి' అని రాసి ఉన్న మాస్కును ధరించి నిరసనలో పాల్గొన్నారు డీఎంకే అధినేత స్టాలిన్​.

DMK President MK Stalin
నీట్​ రద్దు చేయండి.. విద్యార్థులను రక్షించండి: డీఎంకే

By

Published : Sep 14, 2020, 12:05 PM IST

వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్‌ను రద్దు చేయాలని డీఎంకే ఆందోళన చేపట్టింది. నీట్ పరీక్ష భయంతో తమిళనాడులో 11 మంది ఆత్మహత్య చేసుకున్న వేళ పార్లమెంట్‌ ఆవరణతో పాటు చెన్నైలోని అసెంబ్లీ వద్ద నిరసన చేపట్టింది డీఎంకే.

డీఎంకే ఎంపీలు టీఆర్​ బాలు.., కనిమోళిలు సభ ప్రారంభానికి ముందు పార్లమెంట్‌ ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. మాస్కులు ధరించి, తమిళనాడు అసెంబ్లీ ఎదుటకు వచ్చిన ఆపార్టీ ఎమ్మెల్యేలు.. ప్లకార్డులు ప్రదర్శించారు. 'నీట్‌ను రద్దు చేయండి, తమిళనాడు విద్యార్థులను రక్షించండి' అని రాసి ఉన్న మాస్కు ధరించి ఆందోళనలో పాల్గొన్నారు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌.

పాఠశాల విద్యలో పేద, గ్రామీణ ప్రాంతాల విద్యా‌ర్థులకు అధిక మార్కులు వచ్చినప్పటికీ, కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందని కారణంగా నీట్‌లో ఉత్తీర్ణత సాధించటం లేదని డీఎంకే నేతలు పేర్కొన్నారు. ఆ కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా ఉమ్మడి పాఠ్యప్రణాళిక లేనప్పుడు ఉమ్మడి ప్రవేశపరీక్ష ఎందుకని నిలదీశారు.

ఇదీ చూడండి:'మోదీ ఉండగా.. ఆమె అవసరం భాజపాకు లేదు'

ABOUT THE AUTHOR

...view details