తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఓవైసీతో దోస్తీ విషయంలో.. డీఎంకే యూటర్న్​! - dmk vs aidmk

అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడుతున్న తరుణంలో.. తమిళనాట రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈసారి ఎలాగైనా అధికారాన్ని కైవసం చేసుకోవాలని డీఎంకే ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఎం​ఐఎం​తో పొత్తు విషయంలో ఆ పార్టీ వెనక్కి తగ్గింది. ప్రస్తుతం ఉన్న పార్టీలతోనే ఎన్నికల బరిలోకి దిగుతామని, ఇతర పార్టీలతో జట్టు కట్టేది లేదని చెప్పినట్లు తెలుస్తోంది.

Invite to Owaisi: DMK backs off after Resistance from Muslim Allies
ఓవైసీతో దోస్తీ విషయంలో.. డీఎంకే యూటర్న్​

By

Published : Jan 3, 2021, 7:03 PM IST

తమిళనాట అధికార పీఠాన్ని దక్కించుకోవాలని ఊవిళ్లూరుతున్న ద్రవిడ మున్నేట్ర కళగం(డీఎంకే) కీలక నిర్ణయం తీసుకుంది. అసదుద్దీన్​ నేతృత్వంలోని ఏఐఎంఐఎం​ పార్టీని తమ కూటమిలోకి ఆహ్వానించడంపై వెనక్కి తగ్గింది. ప్రస్తుతం ఉన్న పార్టీలతో తప్ప మరే ఇతర పక్షాలను కూటమిలో కలుపుకోవటం లేదని చెప్పినట్లు తెలుస్తోంది.

నూతన సంవత్సరం తొలిరోజున అసదుద్దీన్​ ఓవైసీ నేతృత్వంలోని ఎం​ఐఎం​ను.. డీఎంకే మైనారిటీ విభాగ అధ్యక్షుడు డాక్టర్​ మస్తాన్..​ కూటమిలోకి ఆహ్వానించారు. దీనిపై ఎం​ఐఎం​ కూడా సానుకూలంగా స్పందించింది. అయితే.. ఈ విషయమై ముస్లిం పార్టీల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలోనే ఓవైసీని ఆహ్వానించడంపై డీఎంకే వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

డీఎంకే మిత్రపక్షాలైన ఐయూఎంఎల్​​, ఇండియన్​ నేషనల్​ లీగ్​(ఐఎన్​ఎల్​) పార్టీలు.. ఓవైసీతో చేతులు కలపడంపై అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఎం​ఐఎం​ చేరికతో.. ఓట్లు చీలిపోతాయని భావించాయి. దీనిపై డీఎంకే అధినేత స్టాలిన్​తో సమావేశం కావాలని ప్రయత్నించినట్లు ఐఎన్​ఎల్​ తెలిపింది.

"కూటమిలోకి ఎం​ఐఎం​ను ఆహ్వానించడాన్ని మేం అంగీకరించడం లేదు. ఈ ప్రయత్నాలు చూస్తుంటే.. ఇప్పటికే లౌకిక కూటమిలో ముస్లిం పార్టీల సీట్లను తగ్గించాలని డీఎంకే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది మమ్మల్ని భయపెట్టే ప్రయత్నమే. తమిళనాడులో ఎంఐఎం​కు ఆదరణ లేదు. బిహార్​లో సాధించిన విజయం అనుకోకుండా వచ్చిందే."

-- తాదా రహీమ్​, ఐఎన్​ఎల్​ రాష్ట్ర అధ్యక్షుడు

అసెంబ్లీ ఎన్నికలకు ముందు అతిపెద్ద లౌకిక కూటమి ఏర్పాటుకు డీఎంకే ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మైనారిటీల మద్దతును ప్రదర్శించడానికి 'ఇదయంగలై ఇనైప్పం' పేరుతో జనవరి 6న ర్యాలీ నిర్వహించనుంది. 2019 లోక్​సభ ఎన్నికల్లో డీఎంకే విజయంలో మిత్ర పక్షాలు కీలక పాత్ర పోషించాయి. ఈ నేపథ్యంలో కూటమిలో ఎంఐఎం​ చేరికపై తాజాగా యూటర్న్​ తీసుకుంది డీఎంకే.

అయితే.. ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ​ ఎన్నికల్లో ఎం​ఐఎం​ ఐదు స్థానాల్లో గెలుపొందింది. తమ కూటమి ఓట్లను చీల్చినందుకుగాను.. ఆ పార్టీని 'భాజపా బీ' జట్టుగా మహాఘట్​బంధన్​ విమర్శించింది.

'దేశవ్యాప్తంగా కాంగ్రెస్​ ప్రాబల్యం కోల్పోతున్న తరుణంలో.. ఆ లోటును పూడ్చుకునేందుకు డీఎంకే ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే మిగతా పార్టీలతో జతకట్టాలని చూస్తోంది. కానీ, ఎం​ఐఎం​తో వచ్చే ప్రమాదాన్ని పసిగట్టిన ఆ పార్టీ వెంటనే వెనక్కి తగ్గింది. ఎం​ఐఎం​, భాజపాలు ఒక నాణేనికి రెండు వైపులా ఉన్న చిత్రాలు' అని హైదరాబాద్​ సెంట్రల్​ యూనివర్సిటీలో సోషియాలజీ బోధకుడు డాక్టర్​ ఆర్.తిరునవుక్కరసు పేర్కొన్నారు.

ఇవీ చూడండి:

తమిళనాట వచ్చేది డీఎంకే ప్రభుత్వమే: స్టాలిన్

అన్నాడీఎంకే నుంచే సీఎం అభ్యర్థి: భాజపా

డీఎంకే ఎన్నికల ప్రచార నినాదం ఇదే..

ABOUT THE AUTHOR

...view details