దివంగత కరుణానిధి కుమారుడు, డీఎంకే బహిష్కృత నేత అళగిరి ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. అళగిరి కుమారుడి పేరిట ఉన్న రూ. 40 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కింద మధురై, చెన్నైల్లో ఒలింపస్ గ్రానైట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఫిక్సిడ్ డిపాజిట్ చేసిన సొమ్ము పత్రాల్ని స్వాధీనం చేసుకుంది.
టీఏఎమ్ఐఎన్కు చెందిన స్థలాల్లో అక్రమ మైనింగ్ చేసేందుకు ఎస్ నాగర్జున్, అళగిరి దయానిధి నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని ఈడీ ఆరోపించింది. వీరి చర్య ప్రభుత్వానికి నష్టం చేకూర్చే విధంగా ఉందని పేర్కొంది.