తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆరువారాల్లో వ్యాక్సిన్​ అందుబాటులోకి రావడం కష్టం'

ఓ వ్యాక్సిన్​ బయటకు వచ్చే ముందు అనేకమార్లు ప్రయోగాలు చేయాలని, దాని భద్రతపై మదింపు చేయాలని దిల్లీ ఎయిమ్స్​ డైరక్టర్​ రణ్​దీప్​ సింగ్​ గులేరియా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్​ ప్రకటించినట్టు ఆరు వారాల్లో వ్యాక్సిన్​ను అందుబాటులోకి రావడం చాలా కష్టమని అభిప్రాయపడ్డారు.

difficult to develop a vaccine in six weeks, says Delhi AIIMS director Randeep Singh
'ఆరువారాల్లో వ్యాక్సిన్​ అందుబాటులోకి రావడం కష్టం'

By

Published : Jul 6, 2020, 9:00 AM IST

ఐసీఎంఆర్‌ ప్రకటించినట్లు ఆరు వారాల్లో వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడం కష్టమని దిల్లీలోని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌సింగ్‌ గులేరియా పేర్కొన్నారు. మనుషులపై ప్రయోగాలు నిర్వహించి అది సురక్షితమైందా? కాదా? అని నిర్ధారించుకోవడానికి కొన్ని నెలల సమయం పడుతుందని అభిప్రాయపడ్డారు.

"భారత్‌లో చాలా కంపెనీలు వ్యాక్సిన్‌ అభివృద్ధిలో తలమునకలయ్యాయి. అందులో భారత్‌ బయోటెక్‌తో పాటు సీరం ఇన్‌స్టిట్యూట్‌, క్యాడిలా లాంటి సంస్థలు ఉన్నాయి. వ్యాక్సిన్‌ అభివృద్ధిలో చాలా దశలు ఉంటాయి. ప్రస్తుతం భారత్‌ బయోటెక్‌ రూపొందించిన వ్యాక్సిన్‌ను తొలుత మనుషులపై ప్రయోగించాల్సి ఉంది. అది రోగనిరోధక శక్తిని పెంచుతుందా? లేదా? అన్నది చూడాలి. దీనికి కొన్ని వారాలు పడుతుంది. తర్వాత వ్యాక్సిన్‌ భద్రత గురించి మదింపు చేయాలి. లక్షలాది మందికి దాన్ని ఇస్తారు కాబట్టి భద్రత అతి ముఖ్యం. అది సురక్షితంగా ఉందని, 70-80% మేర నిలకడైన రోగ నిరోధక శక్తిని ఇస్తుందని, ఎవరికి ఇచ్చినా దానివల్ల ప్రతికూల ప్రభావాలు కనిపించవని తేలాకే తదుపరి అడుగు వేయగలం. ఆరువారాల్లో పూర్తి కావడానికి అవకాశాలు తక్కువ. కరోనా పూర్తిగా అంతరించి పోదు. వచ్చే 3-4 నెలల్లో దేశంలో కేసులు తగ్గుతాయని అంచనా వేస్తున్నాం. అందరికీ వ్యాక్సిన్‌ అందించిన తర్వాతే వైరస్‌ తగ్గిపోతుంది. అప్పుడే మనం పూర్వపు సాధారణ పరిస్థితులకు రాగలం"

----రణ్‌దీప్‌సింగ్‌, దిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌.

కరోనా నివారణకు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధిలో ఉన్న టీకాలేవీ 2021లోపు ప్రజా వినియోగానికి అందుబాటులోకి రావని కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ సీనియర్‌ శాస్త్రవేత్త టి.వి.వెంకటేశ్వరన్‌ పేర్కొన్నారు. ఆ శాఖ ఆధ్వర్యంలోని 'ఇండియన్‌ సైన్స్‌ వైర్'లో ఈ మేరకు కథనం రాశారు. దేశీయ ప్రయోగాత్మక టీకాలపై క్లినికల్‌ పరీక్షలకు ఆమోదం తెలపడంతో ఈ మహమ్మారి అంతానికి రంగం సిద్ధమైనట్లేనని తెలిపారు.

ఇదీ చూడండి:-'కరోనా వ్యాక్సిన్​.. ఈ ఏడాది కష్టమే'

ABOUT THE AUTHOR

...view details