బిహార్ 'హ్యామర్ హెడ్‌మ్యాన్' ధర్మేంద్ర మరో రికార్డు సృష్టించేశాడు. ఒక్క నిమిషంలో 12 మి.మీల 15 ఇనుప కడ్డీలను పంటితో సునాయాసంగా వంచేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు నెలకొల్పాడు.
కైమూర్ జిల్లా, రామ్‌గఢ్‌కు చెందిన ధర్మేంద్ర ఓ రైతు కుటుంబంలో పుట్టాడు. నాన్న అపలేశ్వర్ సాధారణ రైతు. తల్లి కుంతి దేవీ గ్రామపంచాయతీ సర్పంచ్. ప్రస్తుతం త్రిపురలో ఎస్ఐగా బాధ్యతలు నిర్వహిస్తున్న ధర్మేంద్రకు.. నిత్యం రికార్డులను వేటాడడం అలవాటే. 2015లో 12.మి.మీ పొడవు గల 24 ఇనుప కడ్డీలను తలతో వంచేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత 2017లో 51 పచ్చి వెలగ పండ్లను తలతో ఈజీగా బద్దలుగొట్టి మరో రికార్డు సృష్టించాడు.