జమ్ముకశ్మీర్‌లో పెట్టుబడులను ఆకర్షించేందుకు సరికొత్త విధానాలపై కేంద్రం కసరత్తు చేస్తోంది. త్వరలోనే వీటిని అందుబాటులోకి తీసుకురానున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
అమెరికా పర్యటనలో ఉన్న ఆర్థిక మంత్రి.. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) ప్రధాన కార్యాలయంలో జరిగిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ, అమెరికా-ఇండియా భాగస్వామ్య సదస్సులో పాల్గొన్నారు.కశ్మీర్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రధానంగా పర్యటకం, చేతివృత్తుల పరిశ్రమ, పట్టు, ఆపిల్, కుంకుమ ఉత్పత్తుల వంటి కీలక రంగాలను గుర్తించినట్లు మంత్రి పేర్కొన్నారు.
జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దు అనంతరం రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ప్రకటించింది ప్రభుత్వం. ఇందులో భాగంగా అనేక చర్యలు చేపట్టింది.