తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉగ్రవాదులతో వెళ్తూ చిక్కిన సీనియర్​ పోలీస్​ అధికారి - jammukashmir latest news

ఉగ్రవాదులతో కలిసి వెళ్తూ ఓ సీనియర్​ పోలీస్​ అధికారి పట్టుబడిన ఘటన జమ్ముకశ్మీర్​ షోపియాన్​ జిల్లాలో జరిగింది. కుల్గాం ప్రాంతంలో రోడ్డుపై తనిఖీలు చేస్తున్న క్రమంలో ఓ కారులో హిజ్బుల్​ ముజాహిదీన్​కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులతో కలిసి ప్రయాణిస్తుండగా పోలీసులు అరెస్ట్​ చేశారు.

militants
ఉగ్రవాదులతో వెళ్తూ చిక్కిన సీనియర్​ పోలీస్​ అధికారి

By

Published : Jan 12, 2020, 10:24 PM IST

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులతో కలిసి కారులో వెళ్తూ ఓ సీనియర్ పోలీస్ అధికారి పట్టుబడటం కలకలం రేపుతోంది. శ్రీనగర్ విమానాశ్రయంలో స్ట్రాటజిక్ యాంటీ హైజాకింగ్ విభాగంలో పనిచేస్తున్న దేవిందర్ సింగ్ అనే పోలీస్ అధికారి, మరో ఇద్దరు ఉగ్రవాదులతో కలిసి కారులో ప్రయాణిస్తూ.. శనివారం అధికారులకు పట్టుబడ్డాడు.

షోపియాన్ జిల్లాలోని కుల్గాం ప్రాంతంలో రోడ్డుపై తనిఖీలు చేస్తున్న సమయంలో ఓ కారులో హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులతో కలిసి ప్రయాణిస్తుండగా... పోలీసులు అరెస్ట్ చేశారు.

ఉగ్రవాదులతో కలిసి వెళ్లటం తీవ్రమైన నేరంగా పేర్కొన్నారు కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్. ఉగ్రవాదులతో కలిసి దేవిందర్ సింగ్‌ను విచారిస్తామన్నారు. ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్న వార్తలు వెలువడిన వెంటనే.. షోపియాన్‌లో దాక్కున్న కొంతమంది ఉగ్రవాదులు మకాం మార్చినట్లు తెలిపారు.

ఇదీ చూడండి: వాయుసేనలోకి మరో 200 యుద్ధ విమానాలు!

ABOUT THE AUTHOR

...view details