గుజరాత్ అహ్మదాబాద్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మోదీ ఓటేసిన రణిప్ పోలింగ్ కేంద్రం వద్ద ప్రజలు బారులు తీరారు. ప్రధాని ఓటేసి బయటకు రాగానే... 'మోదీ మోదీ' అని నినాదాలు చేశారు. వేలిపై సిరా చుక్కను చూపిస్తూ... ప్రజలకు అభివాదం చేస్తూ పోలింగ్ కేంద్రం నుంచి మోదీ కాస్త దూరం నడుచుకుంటూ వచ్చారు.
'తీవ్రవాదులకు ఐఈడీ- మనకు ఓటర్ ఐడీ' - మోదీ
అహ్మదాబాద్లో ప్రధాని నరేంద్ర మోదీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తీవ్రవాదుల ఆయుధమైన ఐఈడీ కంటే ప్రజాస్వామ్య ఆయుధం ఓటర్ ఐడీనే శక్తిమంతమైనదని అభిప్రాయపడ్డారు.
తల్లితో భేటీ అనంతరం ఓటేసిన నరేంద్రమోదీ
తీవ్రవాదులు ఆయుధం ఐఈడీ కంటే ప్రజాస్వామ్య ఆయుధం ఎన్నో రెట్లు శక్తిమంతమైనదని అన్నారు మోదీ.
కుంభమేళాలో పవిత్రస్నానం చేసిన తరవాత ఎంత స్వచ్ఛమైన అనుభూతి ఉంటుందో, అలాగే ఈ ప్రజాస్వామ్య పండుగలో ఓటేస్తే అలాంటి స్వచ్ఛతే ఉంటుంది. తీవ్రవాదుల ఆయుధం ఐఈడీ. కానీ ప్రజాస్వామ్యానికి ఆయుధం ఓటర్ ఐడీ కార్డ్. ఐఈడీ కంటే ఓటరు ఐడీ ఎన్నో రెట్లు శక్తిమంతమైనదని అని నా నమ్మకం. దీన్నిబట్టి ఓటరు కార్డు గొప్పదనం తెలుసుకోవచ్చు.
- నరేంద్రమోదీ, ప్రధానమంత్రి.
Last Updated : Apr 23, 2019, 10:58 AM IST