ఈశాన్య దిల్లీలో ఇటీవల జరిగిన అల్లర్లపై 531 కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటివరకు 1,647 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇందులో 47 కేసులు ఆయుధ చట్టం కింద నమోదయ్యాయి.
అల్లర్లు తగ్గిన తర్వాత.. గత వారం రోజులుగా సమస్యలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు రాలేదని పోలీసులు తెలిపారు.
తాహిల్ బెయిల్ దరఖాస్తు విచారణ
ఈ అల్లర్లలో జరిగిన ఐబీ అధికారి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ ముందస్తు బెయిల్ దరఖాస్తుకు.. సంబంధించిన విచారణను దిల్లీ కోర్టు గురువారం చేపట్టనుంది.
ఈశాన్య దిల్లీలో ఫిబ్రవరి 23న సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనలో 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. చాలా మంది ఆర్థికంగా నష్టపోయారు.