తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీలో నేటి నుంచి మళ్లీ సరి-బేసి నిబంధన - దిల్లీని కమ్మేసిన వాయు కాలుష్యం

దేశ రాజధాని దిల్లీ నగరాన్ని కాలుష్యం కమ్మేసింది. కొన్ని రోజులుగా ఇక్కడ కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కలుషిత గాలి పీల్చడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు ఏర్పడి ఇప్పటికే చాలా మంది ఆసుపత్రుల్లో చేరారు. అప్రమత్తమైన ప్రభుత్వం నేటి నుంచి మరోసారి సరి-బేసి విధానాన్ని అమలులోకి తెచ్చింది.

దిల్లీలో నేటి నుంచి మళ్లీ సరి-బేసి నిబంధన

By

Published : Nov 4, 2019, 5:51 AM IST

Updated : Nov 4, 2019, 8:04 AM IST

దిల్లీలో నేటి నుంచి మళ్లీ సరి-బేసి నిబంధన

దేశ రాజధాని దిల్లీ నగరం కాలుష్యం గుప్పిట్లో చిక్కుకుంది. కాలుష్యం కారణంగా వాయునాణ్యత పూర్తిగా క్షీణించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. నవంబరు 5 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. 50 లక్షల మాస్కులను ప్రజలకు పంపిణీ చేసింది. కాలుష్యాన్ని నియత్రించేందుకు.. మళ్లీ నేటి నుంచి సరి-బేసి విధానాన్ని అమలు చేస్తోంది. ఇవాళ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 వరకు కేవలం సరి సంఖ్యలు గల వాహనాలనే దిల్లీ రహదారులపైకి అనుమతిస్తారు.

పిల్లల ఆరోగ్యం కోసం దిల్లీ ప్రజలందరూ ఈ నిబంధనను పాటించాలని ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. ఆంక్షల వల్ల సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని యంత్రాంగాన్ని ఆదేశించారు.

ఎలా...

నేటి నుంచి నవంబర్​ 15 వరకు ఈ సరి-బేసి నిబంధన అమలుకానుంది. దీని ప్రకారం.. రిజిస్ట్రేషన్‌ నంబరులో చివరి అంకె సరి ఉన్న వాహనాలన్నీ ఒక రోజు, బేసి ఉన్న వాహనాలన్నీ మరో రోజు రోడ్డు మీదకు రావాల్సి ఉంటుంది. నవంబర్​ 10.. ఆదివారం మాత్రం ఈ నిబంధనను సడలించారు.

ఉల్లంఘిస్తే...

ప్రజలు నిబంధనను ఉల్లంఘించకుండా ఉండేందుకు దిల్లీ ప్రభుత్వం ఎక్కడికక్కడ వందల సంఖ్యలో ట్రాఫిక్​ పోలీసులను మోహరించింది. ఉల్లంఘించినవారిపై రూ.4 వేలు చలానా వేయనుంది.

కాలుష్యంపై రాజకీయం...

కేజ్రీవాల్​ నిర్ణయాన్ని ప్రతిపక్ష భాజపా, కాంగ్రెస్​ ప్రచార చర్యగా అభివర్ణించాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసమే ఆమ్​ఆద్మీ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని మండిపడ్డాయి.

Last Updated : Nov 4, 2019, 8:04 AM IST

ABOUT THE AUTHOR

...view details