తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీని వణికిస్తున్న చలి.. 20 డిగ్రీల కిందకు ఉష్ణోగ్రతలు

దిల్లీలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. ఈ నెల చివరి నాటికి ఉష్ణోగ్రతలు మరింత పడిపోయి 1901 తర్వాత అత్యంత కనిష్ఠ స్థాయి నమోదైన డిసెంబర్​ నెలల్లో రెండో అతిశీతల నెలగా డిసెంబర్​ రికార్డు సృష్టించనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సుమారు 19.15 డిగ్రీల సెల్సియస్​కు పడిపోయే అవకాశం ఉందని పేర్కొంది.

Delhi in for its second-coldest December since 1901
వందేళ్ల తర్వాత దిల్లీలో అత్యంత కనిష్ఠ స్థాయికి ఉష్ణోగ్రతలు​!

By

Published : Dec 27, 2019, 5:51 AM IST

దేశ రాజధాని దిల్లీ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠ స్థాయికి పడుపోతున్నాయి. రోజు రోజుకు చలి తీవ్రత పెరిగిపోతోంది. ఈనెల చివరి నాటికి 20 డిగ్రీల సెల్సియస్​ కన్నా దిగువకు ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అదే జరిగితే 1901 తర్వాత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైన డిసెంబర్​ నెలల్లో రెండో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైన నెలగా​ ఈ డిసెంబర్​ నిలువనుందని పేర్కొంది.

" డిసెంబర్​లో సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత 1919, 1929, 1961, 1997 సంవత్సరాలలో 20 డిగ్రీల సెల్సియస్​ కంటే తక్కువగా నమోదయ్యాయి. ఈ ఏడాది డిసెంబర్​లో సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత గత గురువారం వరకు 19.85 డిగ్రీల సెల్సియస్​గా నమోదైంది. అది డిసెంబర్​ 31 నాటికి 19.15 డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉంది. అదే జరిగితే.. 1901 తర్వాత రెండో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైన డిసెంబర్​గా నిలువనుంది. 1997, డిసెంబర్​లో అత్యంత కనిష్ఠంగా 17.03 డిగ్రీలుగా నమోదైంది."

- భారత వాతావరణ శాఖ తెలిపింది.

ఇదీ చూడండి:వంతెన నిర్మాణ శిక్షణలో ప్రమాదం.. ఇద్దరు జవాన్లు మృతి

ABOUT THE AUTHOR

...view details