తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పెళ్లి వయసుపై కేంద్రానికి దిల్లీ హైకోర్టు నోటీసులు - పెళ్లి వయసు

మహిళలు, పురుషులకు చట్టబద్ధమైన పెళ్లి వయసు సమానం చేయాలని దాఖలైన వ్యాజ్యంపై సమాధానం చెప్పాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది దిల్లీ హైకోర్టు.

పెళ్లి వయసు

By

Published : Aug 19, 2019, 6:09 PM IST

Updated : Sep 27, 2019, 1:24 PM IST

మహిళలు, పురుషులు.. ఇద్దరికీ పెళ్లి చేసుకునేందుకు ఒకే చట్టబద్ధమైన వయసును నిర్ణయించాలని దిల్లీ హైకోర్టులో వ్యాజ్యం దాఖలయింది. పిటిషన్​ను పరిశీలించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ డీఎన్​ పటేల్​ నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ అంశంపై వైఖరి తెలపాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

ఇది బహిరంగ వివక్ష

ప్రస్తుత చట్టం ప్రకారం మహిళలు 18, పురుషులు 21 వయసు వచ్చేవరకు పెళ్లి చేసుకోవడానికి అనర్హులు. ఇది బహిరంగంగా వివక్ష చూపటమేనని పిటిషన్​దారు, భాజపా నేత అశ్వినీ కుమార్​ ఉపాధ్యాయ్​ పేర్కొన్నారు. ప్రస్తుతం మనం నిర్ణయించుకున్న విధానం పితృస్వామ్యం నుంచి వచ్చిందే కానీ అందుకు శాస్త్రీయమైన కారణమేదీ లేకపోవటం విచారకరమని తెలిపారు.

ఇదీ చూడండి: 'కశ్మీర్​లో మానవ హక్కుల ఉల్లంఘన'

Last Updated : Sep 27, 2019, 1:24 PM IST

ABOUT THE AUTHOR

...view details