తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నిర్భయ' దోషికి క్షమాభిక్ష వద్దు: దిల్లీ ప్రభుత్వం

నిర్భయ కేసులో దోషి దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్​ను తిరస్కరించాలని దిల్లీ ప్రభుత్వం సిఫార్సు చేసింది. ఈ మెరకు లెఫ్టినెంట్ గవర్నర్​కు లేఖ రాశారు దిల్లీ హోంశాఖ మంత్రి సత్యేంద్ర జైన్​.

Nirbhaya case
నిర్భయ కేసు  దోషి క్షమాభిక్ష పిటిషన్​ తిరస్కరణ!

By

Published : Dec 1, 2019, 8:32 PM IST

2012 నిర్భయ కేసులో ఉరిశిక్ష పడ్డ నలుగురు దోషుల్లో ఒకరు దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించాలని దిల్లీ ప్రభుత్వం సిఫార్సు చేసింది. ఈ మేరకు దిల్లీ హోం శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌.... లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌కు లేఖ రాశారు.

దేశ రాజధాని దిల్లీలో 2012 డిసెంబర్‌లో ఓ విద్యార్ధినిపై ఆరుగురు యువకులు బస్సులోనే అత్యాచారం చేసి దారుణంగా హతమార్చారు. వీరిలో ఐదుగురికి.. కింది కోర్టులు మరణ దండన విధించాయి. ఐదుగురిలో ఒకరు జైలులో ఆత్మహత్య చేసుకున్నారు. కింది కోర్టులు విధించిన మరణశిక్షను దిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు సమర్ధించాయి.

ఇదీ చూడండి: 'అయోధ్య కాదు.. విద్య, ఉద్యోగాలపై దృష్టిసారించండి'

ABOUT THE AUTHOR

...view details