తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జన్​ ఆక్రోశ్ ర్యాలీపై పోలీసుల ఉక్కుపాదం - patna

పట్నా జన్​ ఆక్రోశ్​ ర్యాలీలో పోలీసుల లాఠీ ఛార్జ్​ చేశారు. ఆర్​ఎల్ఎస్పీ అధినేత ఉపేంద్ర కుష్వాహా గాయపడ్డారు.

ఉపేంద్ర కుష్వాహా

By

Published : Feb 2, 2019, 6:09 PM IST

Updated : Feb 2, 2019, 6:32 PM IST

RALLY
బిహార్​ విద్యారంగంలో మార్పులు జరగాలంటూ రాష్ట్రీయ లోక్​ సమతా పార్టీ(ఆర్​ఎల్​ఎస్పీ) పట్నాలో చేపట్టిన జన్ ​ఆక్రోశ్ ర్యాలీ హింసాత్మకంగా మారింది. ఉద్యమకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్​ చేశారు. ఈ ఘటనలో ఆర్​ఎల్ఎస్పీ అధినేత ఉపేంద్ర కుష్వాహా గాయపడ్డారు. హుటాహుటిన ఆయనను ఆసుపత్రికి తరలించారు పార్టీ నేతలు.

బిహార్​లో విద్యా ప్రమాణాలు పూర్తిగా పడిపోయాయని, ప్రక్షాళన అత్యవసరమని ఉపేంద్ర కుష్వాహా రెండేళ్ల క్రితం ఉద్యమాన్ని ప్రారంభించారు. దానిలో భాగంగానే శనివారం పట్నాలో జన్ ఆక్రోశ్​ ర్యాలీ నిర్వహించారు.

Last Updated : Feb 2, 2019, 6:32 PM IST

ABOUT THE AUTHOR

...view details