తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మెరుపు' ఘనతను మోదీకిస్తే అభ్యంతరమేల? - మెరుపుదాడులు

మెరుపు దాడుల ఘనతను ప్రధాని నరేంద్ర మోదీకి ఇవ్వడానికి ప్రతిపక్షాలు ఎందుకు అభ్యంతరం చెబుతున్నాయని ప్రశ్నించారు దిల్లీ భాజపా​ నేతలు. 1971లో పాకిస్థాన్​పై భారత్​ యుద్ధంలో గెలుపొందినపుడు అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి కీర్తి దక్కిందని గుర్తు చేశారు.

మెరుపు దాడుల ఘనతను మోదీకిస్తే అభ్యంతరాలెందుకు?

By

Published : Apr 29, 2019, 6:34 AM IST

Updated : Apr 29, 2019, 6:41 AM IST

మెరుపు దాడుల ఘనతను మోదీకివ్వాలని దిల్లీ భాజపా నేతల వ్యాఖ్యలు

1971లో పాకిస్థాన్​తో యుద్ధంలో భారత్​ విజయానికి.. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని కీర్తిస్తే లేని సమస్య... మెరుపుదాడుల ఘనత మోదీకి ఇస్తే అభ్యంతరాలెందుకని ప్రశ్నించారు దిల్లీ భాజపా నేతలు.

మే 12న పోలింగ్​ జరగనున్న దేశ రాజధాని దిల్లీలో రాజ్​పుత్ సామాజిక వర్గంతో సమావేశం ఏర్పాటు చేసింది భాజపా. పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, దిల్లీ-ఉత్తరాఖండ్​ భాజపా బాధ్యులు శ్యామ్​ జాజు, లోక్​సభ ఎన్నికల కో-ఇన్​ఛార్జ్ జై భన్​ సింగ్ పవాయ హజరయ్యారు. 2014కు ముందు ప్రభుత్వాలు సైనికుల త్యాగాలను ఉపేక్షించాయని ఆరోపించారు.

ప్రధాని మోదీ హయాంలో మెరుపు దాడులు నిర్వహించి సైన్యం శత్రు దేశాలకు దీటుగా బదులివ్వగల సామర్థ్యమున్నట్లు నిరూపించుకుందని వ్యాఖ్యానించారు భాజపా నేతలు.

ఇదీ చూడండి: గంభీర్​ ప్రచార నిషేధానికి ఈసీకి ఆప్​ లేఖ....

Last Updated : Apr 29, 2019, 6:41 AM IST

ABOUT THE AUTHOR

...view details