తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అయోధ్య భూమిపూజకు ఇవి మంచి సంకేతాలు కావు' - అయోధ్య భూమి పూజ

అయోధ్య రామమందిర భూమిపూజ మూహూర్తంపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వ్యంగంగా స్పందించారు. మూహూర్తానికి ముందు భాజపా కీలక నేతలకు కరోనా సోకటం అపశకునమని, తేదీని వాయిదా వేయాలని ప్రధాని నరేంద్రమోదీని కోరారు. హిందూ గురువులు కూడా ఆగస్టు 5న మూహూర్తాన్ని తప్పుబట్టినట్లు గుర్తు చేశారు.

Digvijaya
దిగ్విజయ్ సింగ్

By

Published : Aug 3, 2020, 8:58 PM IST

అయోధ్య రామమందిరం భూమిపూజ వాయిదా వేయాలని ప్రధాని నరేంద్రమోదీని అభ్యర్థించారు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. భూమి పూజ కార్యక్రమానికి ముందు కీలక నేతలకు కరోనా సోకటం మంచి సంకేతం కాదని వ్యంగంగా వర్ణించారు. మంచి పనులు ప్రారంభించడానికి ప్రస్తుత పరిస్థితులు అంత అనుకూలంగా లేవని వివరించారు.

" కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మధ్యప్రదేశ్, కర్ణాటక ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, బీఎస్ యడియూరప్ప, మధ్యప్రదేశ్ భాజపా అధ్యక్షుడు వీడీ శర్మ, యూపీ భాజపా అధ్యక్షుడు స్వతంత్ర దేవ్​ సింగ్​ నేతలకు కరోనా సోకింది. అయోధ్య రామమందిర భూమి పూజకు ముందు ఇలా జరగటం మంచి సంకేతం కాదు."

- దిగ్విజయ్ సింగ్​, కాంగ్రెస్ సీనియర్ నేత

హిందూ గురువులు వ్యతిరేకిస్తున్నారు..

హిందూ గురువులు కూడా జోతిష్య శాస్త్రం ప్రకారం ఆగస్టు 5వ తేదీ మూహూర్తం బాగోలేదని చేసిన వ్యాఖ్యలను దిగ్విజయ్​ గుర్తుచేశారు. ద్వారక-శారద పీఠం శంకరాచార్య, జగత్​ గురు స్వామి స్వరూపానంద్​జీ మహారాజ్​ ప్రకటనలను ఉటంకించారు. భాజపాకు చెందిన సుబ్రమణ్యస్వామి కూడా వ్యతిరేకించారని అన్నారు.

"అంటే వేల ఏళ్లుగా ఉన్న హిందూ నమ్మకాలకు మోదీ అతీతంగా ఉన్నారు. ఇది హిందుత్వమా? నేను వ్యతిరేకించేది భూమి పూజను కాదు. మూహూర్తాన్నే. అందువల్ల భూమి పూజను వాయిదా వేయాలని ప్రధాని మోదీని నమస్కరించి వేడుకుంటున్నా. దుర్మూహూర్తం వెళ్లిపోయిన తర్వాత భూమిపూజను నిర్వహించండి."

- దిగ్విజయ్ సింగ్, కాంగ్రెస్ సీనియర్ నేత

ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత రామమందిరాన్ని రామ్​ల​ల్లా సాధించింది. కానీ ప్రధాని మోదీ సౌలభ్యం కోసం మూహూర్తాన్ని నిర్ణయించటం ఎంతవరకు సబబని ప్రశ్నించారు దిగ్విజయ్. ఇది ప్రజలందరికి సంబంధించినది, కానీ మోదీ ఒక్కరే నిర్ణయం తీసుకోవటం ఏమిటని విమర్శించారు.

ఇదీ చూడండి:కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్

ABOUT THE AUTHOR

...view details