తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా ఎఫెక్ట్​: విద్యాసంస్థలు, సినిమా హాళ్లు అన్నీ బంద్​ - corona latest

కరోనా వైరస్​ కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగాలు మరింత అప్రమత్తమయ్యాయి. దిల్లీలో పాఠశాలలకు ఇప్పటికే సెలవులు ప్రకటించగా, ఇప్పుడు సినిమా హాళ్లనూ మూసివేయనున్నట్లు కేజ్రీవాల్ సర్కార్ తెలిపింది. రాష్ట్రపతి భవన్​కు పర్యటకుల సందర్శనను రేపటి నుంచి నిలిపివేస్తున్నారు. అనవసర ప్రయాణాలు చేయొద్దని విదేశీ మంత్రిత్వశాఖ సూచించింది.

Defence ministry sets up 7 more quarantine facilities for coronavirus patients
కరోనా...

By

Published : Mar 12, 2020, 9:25 PM IST

కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు అధికారులు గట్టి చర్యలు చేపడతున్నారు. పలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. ప్రజలు అనవసర ప్రయాణాలు చేయకూడదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది. ఎలాంటి భయాందోళనకు గురికావద్దని పేర్కొంది.

దిల్లీ థియేటర్లు బంద్​..

కరోనా వైరస్ కారణంగా దిల్లీలో ఇప్పటికే పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. ఇప్పుడు సినిమా హాళ్లనూ మార్చి 31వరకు మూసివేస్తున్నట్లు కేజ్రీవాల్ సర్కార్​ తెలిపింది.

రాష్ట్రపతి భవన్​న్​కు నో ఎంట్రీ.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో రేపటి నుంచి రాష్ట్రపతి భవన్​కు సందర్శకులకు అనుమతి లేదని అధికారులు తెలిపారు.

నో షేక్​ హ్యాండ్​..

కరోనా వైరస్ కారణంగా లాయర్లు ఎవరూ కరచాలనం చేసుకోవద్దని బాంబే బార్ అసోసియేషన్ సూచించింది. అందరూ దీనిని పాటించాలని తెలిపింది.

మరో 7 నిర్బంధ కేంద్రాలు..

ముందు జాగ్రత్త చర్యగా కరోనా బాధితుల కోసం అదనంగా మరో ఏడు నిర్బంధ కేంద్రాలను ఏర్పాటు చేసింది రక్షణ మంత్రిత్వ శాఖ. విదేశాల నుంచి వచ్చే భారతీయుల కోసం వీటిని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:ట్రంప్​తోపాటు ఆ దేశాధినేతకూ కరోనా ముప్పు!

ABOUT THE AUTHOR

...view details