ఆయుధాలు, సైనిక సంపత్తిని సమకూర్చుకోవడం కోసం రూ. 2 వేల కోట్ల ఆయుధ కొనుగోలుకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. ఆయుధ సేకరణ అంశంలో నిర్ణయాలు తీసుకునే అత్యున్నత మిలటరీ విభాగం.. రక్షణ కొనుగోళ్ల కమిటీ(డీఏసీ) ఈ మేరకు ప్రతిపాదనలను ఆమోదించింది.
రూ. 2 వేల కోట్లతో ఆయుధ కొనుగోళ్లకు రక్షణ శాఖ ఆమోదం - dca
ఆయుధ సంపత్తిని సమకూర్చుకునే విధంగా.. రూ. 2 వేల కోట్లతో ఆయుధాల కొనుగోలు ప్రతిపాదనలకు రక్షణ శాఖ శుక్రవారం ఆమోదం తెలిపింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్(డీఏసీ) ఆయుధ సేకరణకు ఆమోద ముద్ర వేసింది.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలోని డీఏసీ వీటికి ఆమోదం తెలిపినట్లు ఆ శాఖ ప్రతినిధి వెల్లడించారు. వీటితో పాటు T-72, T-90 యుద్ధ ట్యాంకుల్లో వినియోగించే మందుగుండు సామగ్రిని దేశీయంగానే అభివృద్ధి చేసి ఉత్పత్తి చేయాలనే ప్రతిపాదనలకూ డీఏసీ ఆమోదం తెలిపింది. సైన్యం కోసం డీఆర్డీవో సహా దేశీయ కంపెనీలు రూపొందించిన పరికరాల కొనుగోలుకు కూడా ఆమోద ముద్ర వేసింది. 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమ ప్రేరణలో భాగంగా స్వదేశీ సాంకేతికత వినియోగంపై దృష్టి సారించినట్లు స్పష్టం చేశారు రక్షణ శాఖ అధికారులు.