తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హోటల్​ కూలిన ఘటనలో 14కు మృతులు - 14

హిమాచల్‌ ప్రదేశ్‌ సోలన్‌ జిల్లా కుమార్​హట్టిలో భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరింది. మృతుల్లో 13 మంది జవాన్లు, ఒక స్థానిక పౌరుడు ఉన్నారు.

హిమాచల్ భవనం కూలిన ఘటనలో 14కు మృతులు

By

Published : Jul 15, 2019, 4:14 PM IST

హిమాచల్‌ప్రదేశ్‌లోని సోలన్‌ జిల్లాలో భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరింది. మృతుల్లో 13 మంది జవాన్లు కాగా ఒక స్థానిక పౌరుడు ఉన్నారు. ఇప్పటివరకు ఐదుగురు జవాన్లు, 12 మంది పౌరులను సహాయక సిబ్బంది రక్షించారు. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.

హిమాచల్‌ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు కుమార్‌హట్టి ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం ఆదివారం సాయంత్రం కుప్పకూలింది. పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద ఇంకా కొంతమంది చిక్కుకొని ఉన్నారని అనుమానాలున్నాయి. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

హిమాచల్​ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్‌ ఘటనాస్థలాన్ని సందర్శించారు. నిబంధనలు పాటించకుండా భవన నిర్మాణం చేపట్టిన కారణంగానే ప్రమాదం చోటుచేసుకుందన్నారు. ప్రమాద కారణాలపై తక్షణ విచారణకు ఆదేశించారు.

భవనం​ యజమానిపై కేసు నమోదు చేశారు పోలీసులు.

ABOUT THE AUTHOR

...view details