బంగాళాఖాతంలో కొనసాగుతున్న 'అంపన్' సోమవారం సూపర్ సైక్లోన్‌గా మారింది. ఈ క్రమంలోనే బుధవారం తీరం దాటినప్పుడు బంగాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. సుమారు 196 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురు గాలులతో.. తుపాను బీభత్సం సృష్టించనుందని హెచ్చరించింది. అంపన్ కారణంగా తీరప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
ఒడిశాలోని కొన్ని తీర ప్రాంతాల్లోనూ తుపాను ప్రభావం చూపనున్నట్లు పేర్కొంది . అలలు 6 మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడనున్నట్లు తెలిపింది. ఫలితంగా మే 20 వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.
ప్రధాని సమీక్ష...