తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తమి​ళనాడు​లో 9వ శతాబ్దంలోనే సైకిల్​..! - గుర్రాలు

భారత్​లో సైకిల్​ ఎప్పటి నుంచి వినియోగంలోకి వచ్చిందని మిమ్మల్ని అడిగితే..? 18వ శతాబ్దంలో అని తడబడకుండా చెప్పేస్తారు కదూ! కానీ, తమిళనాడులో 9వ శతాబ్దంలో కట్టిన పంచవర్ణేశ్వర ఆలయంలో దొరికిన ఆధారాలు చూస్తే ముక్కున వేలేసుకుంటారు..!

తమి​ళనాడు​లో 9వ శతాబ్దంలోనే సైకిల్​..!

By

Published : Jul 8, 2019, 6:46 AM IST

తమి​ళనాడు​లో 9వ శతాబ్దంలోనే సైకిల్​..!

బ్రిటిష్ పాలనలోనే భారతీయులకు సైకిల్ పరిచయమైందనుకునే వారిని.. తమిళనాడు తిరుచ్చిలో బయటపడ్డ 9వ శతాబ్దపు సైకిల్​ ఆనవాళ్లు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అవును, ఓ వ్యక్తి సైకిల్ నడుపుతున్న చిత్రాలు పంచవర్ణేశ్వర ఆలయ స్తంభాలపై దర్శనమిస్తున్నాయి. ఈ ఆలయాన్ని 9వ శతాబ్దంలోనే నిర్మించినట్లు ఆధారాలున్నాయని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు.

గుర్రాలు, ఎడ్ల బండ్లే కాకుండా భారత దేశంలో సైకిల్​ కూడా ప్రాచీన వాహనమేనని నిరూపించేలా ఉంది స్తంభంపై చెక్కిన ఈ శిల్పం. పూర్వం వ్యాపారస్తులు సామగ్రిని మోసేందుకు ద్విచక్ర వాహనాలను తయారు చేసి ఉపయోగించేవారట. అయితే అవి ఇప్పటి సైకిల్​లాగా చైన్​, బ్రేక్​లు కలిగి ఉండకపోవచ్చునని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

" ఈ రాతి ఆలయాన్ని 9వ శతాబ్దంలో నిర్మించారు. ఈ ఆలయానికి గొప్ప చరిత్ర ఉంది. అప్పట్లో చెట్టియార్​ వర్గానికి చెందిన వారు సైకిళ్లపై వ్యాపారం చేసేవారు. గుడి నిర్మాణ సమయంలో సైకిళ్లు ఉండేవట. అందుకే చరిత్ర తెలిసేందుకు స్తంభాలపై చెక్కించారు ''

_ఆలయ పూజారి.

ఈ ఆలయానికి ఘన చరిత్రే ఉంది. ఈశ్వరుడు పంచవర్ణాల్లో దర్శనిమిస్తాడిక్కడ. ఓసారి కరికాళ అనే చోళ రాజు.. ఏనుగుపై ఈ గుడికి వచ్చినప్పుడు గజరాజు మతిస్తిమితం కోల్పోయి పారిపోయింది. అప్పుడు శివుడు కోడి పుంజు రూపంలో వచ్చి గజరాజుపైకి దూకి, తలను పొడిచి నయం చేశాడట.
ఈ ఆధారాలతో 9వ శతాబ్దంలోనే మన పూర్వీకులు సైకిల్ పై స్వారీ చేసిన దాఖలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని తిరుచ్చి వాసులు చెబుతున్నారు.​

ABOUT THE AUTHOR

...view details