తెలంగాణ

telangana

ETV Bharat / bharat

త్వరలో సీడబ్ల్యూసీ భేటీ- నూతన సారథిపై స్పష్టత! - పార్లమెంట్

కాంగ్రెస్ నూతన అధ్యక్షుడి అంశం త్వరలో కొలిక్కివచ్చే అవకాశం కన్పిస్తోంది. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన అనంతరం కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ భేటీ జరగనుందని తెలిపారు పార్టీ అధికార ప్రతినిధి సుర్జేవాలా. ఈ సమావేశంలో నూతన అధ్యక్షుడిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

త్వరలో సీడబ్ల్యూసీ భేటీ- నూతన సారథిపై స్పష్టత!

By

Published : Aug 1, 2019, 3:47 PM IST

కాంగ్రెస్‌ నూతన సారథి అంశంపై సందిగ్ధం నెలకొన్న నేపథ్యంలో ఈ విషయమై ఓ ప్రకటన చేశారు ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్​దీప్ సుర్జేవాలా. ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాలు ముగిసిన తర్వాత కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) భేటీ కానున్నట్లు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నూతన అధ్యక్షుడి ఎన్నికపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

వివిధ రాష్ట్రాలకు చెందిన పార్టీ కార్యదర్శులు, నేతలతో భేటీ అయ్యారు సుర్జేవాలా. సీడబ్ల్యూసీ సమావేశం జరిగే తేదీపై తుది నిర్ణయం తీసుకోలేదన్నారు.

పెద్ద ఎత్తున కార్యక్రమాలు..

ఆగస్టు 20న మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ 75వ జయంతి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఘనంగా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆయా రాష్ట్రాల కాంగ్రెస్​ వర్గాలతో చర్చించినట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ఐరాస వార్షిక సదస్సులో ప్రసంగించనున్న మోదీ

ABOUT THE AUTHOR

...view details