370 అధికరణ రద్దు అనంతరం కశ్మీర్లో హింస చెలరేగకుండా ముందస్తు చర్యలు తీసుకున్న కేంద్రం.. నెమ్మదిగా ఆంక్షలు ఎత్తివేస్తోంది. అయితే నేడు మొహర్రం వేడుకల సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ తరహా ఆంక్షలను పునరుద్ధరించింది.
శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా కశ్మీర్‌లోని చాలా ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. లాల్‌చౌక్‌లోని కమర్షియల్ హబ్ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో భద్రతా బలగాలను పెద్ద సంఖ్యలో మోహరించారు అధికారులు. 1990లో సాయుధ తిరుగుబాటు అనంతరం కశ్మీర్లో ఊరేగింపులను నిషేధించారు.
ముస్లింలు విశ్వసించే హిజ్రీ క్యాలెండర్‌లో నూతన సంవత్సర ప్రారంభ రోజే మొహర్రం. ఇస్లాం మతస్థులు ఈ మాసంలో శోకదినాలు పాటిస్తారు. ఈ రోజు మత ప్రధాన ప్రవక్త మహ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైవ సల్లం మనవడు ఇమామె హుస్సేన్‌తో పాటు ఆయన అనుచరులు, కుటుంబ సభ్యులు వీరమరణం పొందారని.. వారిని స్మరిస్తూ వారి పేర్లతో పీర్లు ప్రతిష్ఠించి ఊరేగిస్తారు.