పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా గురువారం తీవ్ర స్థాయి హింసాత్మక ఆందోళనలు చెలరేగి ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన కర్ణాటకలోని మంగళూరు క్రమంగా కుదుటపడుతోంది. ప్రశాంత పరిస్ధితులు నెలకొంటూ ఉండటం వల్ల క్రమంగా కర్ఫ్యూను సడలిస్తున్నారు అధికారులు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూను సడలించారు.
మంగళూరులో రేపటి నుంచి 'ఉదయం కర్ఫ్యూ' ఎత్తివేత - citizenship law
పౌరచట్టానికి వ్యతిరేకంగా జరుగుతోన్న నిరసనలు కర్ణాటకలో కాస్త తగ్గుముఖం పట్టాయి. గురువారం హింసాత్మక అల్లర్లు జరిగిన మంగళూరులో క్రమంగా ఆంక్షలు ఎత్తివేస్తున్నారు అధికారులు. రేపటి నుంచి ఉదయం పూట పూర్తిస్థాయిలో కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్లు తెలిపారు.
రేపటి నుంచి కర్ణాటకలో కర్ఫ్యూ ఎత్తివేత
అల్లర్ల సమయంలో పోలీసు కాల్పుల్లో మంగళూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. ఈ ఇద్దరి కుటుంబాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప పరామర్శించారు. నిబంధనల ప్రకారం వారి కుటుంబానికి పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. ఆదివారం నుంచి ఉదయం పూట కర్ఫ్యూను పూర్తిగా ఎత్తివేస్తామని ఆయన తెలిపారు. అల్లర్లపై తగిన దర్యాప్తు జరిపిస్తామని వెల్లడించారు.
ఇదీ చూడండి:మరోసారి పాక్ దుశ్చర్య.. ఇద్దరు దాయాది సైనికులు హతం
Last Updated : Dec 21, 2019, 5:54 PM IST
TAGGED:
citizenship law