కేంద్రంపై విమర్శలతో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. రైతు సమస్యల పట్ల కేంద్రం దురహంకార వైఖరితో వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. రైతులతో ఎన్నిసార్లు చర్చలు జరిపినా.. సమస్యల పరిష్కారం దిశగా ప్రయత్నించడం లేదని మిమర్శించారు. సాగు చట్టాలపై కాంగ్రెస్ మొదటి నుంచి స్పష్టమైన వైఖరితో ఉందని, వాటిని అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికే ప్రధాన అజెండాగా సీడబ్ల్యూసీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైంది. పార్టీ సంస్థాగత ఎన్నికల షెడ్యూల్, ప్లీనరీ, ఇతర కీలక అంశాలపై భేటీలో చర్చించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
ఈ భేటీలో ప్రభుత్వ ఆర్థిక విధానాలను కూడా సోనియా తప్పుబట్టారు. ప్రమాదకర ప్రైవేటీకరణలో ప్రభుత్వం చిక్కుకుపోయిందన్నారు.