తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ జంట పెళ్లికి గోమాతే ముఖ్య అతిథి - surat couple invited cow as chief guest for thei weddin

సూరత్​లో జరగబోయే ఆ పెళ్లికి ముఖ్య అతిథి గోమాత. వినడానికే విడ్డూరంగా ఉంది కదూ. కానీ ఇది నిజం. పర్యావరణాన్ని, భారత సంస్కృతిని ప్రేమించే ఓ జంట తమ పెళ్లిని ఎలా జరుపుకోవాలనుకుంటుందో వింటే నోటి మీద వేలు వేయక మానరు. మరి ఆ విశేషాలేంటో తెలియాలంటే ఈ కథనం చూడాల్సిందే.

cow invited as Special invitee in wedding ceremony in Surat, gujarat_sang
ఆ జంట పెళ్లికి గోమాతే ముఖ్య అతిథి

By

Published : Jan 29, 2020, 6:53 AM IST

Updated : Feb 28, 2020, 8:45 AM IST

ఆ జంట పెళ్లికి గోమాతే ముఖ్య అతిథి

గుజరాత్​ సూరత్​లో గోమాతను ముఖ్య అతిథిగా ఆహ్వానించింది ఓ జంట. వారి పెళ్లికి మరెన్నో ప్రత్యేక ఏర్పాట్లు చేసి అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది.

ఇదిగిదిగో పెళ్లి ప్రత్యేకతలు...

పెళ్లి తేదీ దగ్గరపడుతోంది కదా.. పెళ్లి పనులు ఎక్కడివరకు వచ్చాయి అని అడిగిన ఓ బంధువుకు... "ఆ.. దాదాపు అయిపోయినట్టే.. అచ్చమైన సంస్కృత భాషలో ఐదు పేజీల వస్త్ర శుభలేఖలు అచ్చయిపోయాయి. ముఖ్యఅతిథిగా గోమాత విచ్చేస్తున్నారు. 31 మంది వేద బ్రాహ్మణులు ఎలాగో వస్తున్నారు. ఇక ప్లాస్టిక్​ మచ్చుకు కూడా కనిపించకూడదు కాబట్టి 5 వేల మట్టి గ్లాసులు సిద్ధంగా ఉన్నాయి. వీడియోలు, ఫొటోలూ గట్రా తీయించే పనిలేదు కాబట్టి వారికి చెప్పలేదు. ఇక పెళ్లికి వచ్చే కట్నాన్ని దేశం కోసం సేవ చేసే సంస్థలకు ఎలా అందించాలో ఆలోచించాలంతే.." అని సమాధానం చెప్పేశారు ఈ వధూవరులు.

చార్టర్డ్​ అకౌంటెంట్​ అభిలాష, అడ్మినిస్ట్రేషన్​లో పీహెచ్​డీ చేస్తున్న రోహిత్​ వివాహం ఫిబ్రవరి 3న జరగనుంది. విద్యావంతులైన వారిద్దరూ.. పెళ్లిలో ఆధునికతకుపోయి పర్యావరణాన్ని కలుషితం చేయాలనుకోవట్లేదు. పూర్తిగా భారతీయ సంప్రదాయంలోనే ఏడడుగులు వేసి ఒక్కటవ్వాలనుకుంటున్నారు.
అందుకే.. దశాబ్దాల క్రితం చూసిన ఘనమైన హిందూ కల్యాణ వైభోగాన్ని పునఃసృష్టించనున్నారు. ఇరు కుటుంబాలను ఒప్పించి ఈ తరం వేడుకల్లాగా కృత్రిమంగా జరిపించకుండా.. స్వచ్ఛమైన వివాహ బంధంతో కొత్త జీవితంవైపు అడుగులు వేస్తున్నారు.

"మా పెళ్లిలో ప్రత్యేకత ఏమిటంటే.. మా వివాహ ఆహ్వాన పత్రిక సంస్కృతంలో ఉంటుంది. ఇక ముఖ్య అతిథిగా ఈ సృష్టిని కాపాడుతున్న గోమాత హాజరవుతుంది. మా పెళ్లి ఊరేగింపులో అందరికంటే ముందు పెళ్లిపెద్ద గోమాత ఉంటుంది. ఆ తరువాతే వరుడికి స్వాగతం దక్కుతుంది. గోమాత సాక్షిగా మేము ఏడడుగులు వేస్తాం. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఒక్కసారి వాడిపడేసే ప్లాస్టిక్​ను మేము ఉపయోగించము. ఆ స్థానంలో ఐదు వేల మట్టి గ్లాసులు, పాత్రలు ఆర్డర్​ చేశాం. దీని వల్ల కుమ్మరి వృత్తివారికి ఉపాధి లభిస్తుంది."
-రోహిత్​, వరుడు
ఇదీ చదవండి:బావిలో పడిన ఏనుగును రక్షించేందుకు అదిరే ఐడియా

Last Updated : Feb 28, 2020, 8:45 AM IST

ABOUT THE AUTHOR

...view details