మహారాష్ట్రలో మరో 22వేల మందికి కరోనా
దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లోనే అధిక కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో 22,084 కేసులు వెలుగుచూశాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో 6,846 మంది వైరస్ బారిన పడ్డారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో 3 లక్షలు దాటిన కేసులు
దేశంపై కరోనా పంజా విసురుతోంది. రోజురోజుకు వైరస్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. తాజాగా 22,084 మందికి పాజిటివ్‌గా తేలింది. మరో 391 మంది మరణించగా.. 13,489 మంది కోలుకున్నారు.. రాష్ట్రంలో మొత్తం 10,37,765 మంది బాధితులు ఉన్నారు. వీరిలో 7,28,512 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 29,115 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఉత్తర్‌ప్రదేశ్‌లో తాజాగా 6,846 కేసులు బయటపడ్డాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 3లక్షలు దాటింది. రాష్ట్రంలో 67,955 యాక్టివ్ కేసులు ఉండగా.. 2,33,527 మంది కోలుకున్నారు.
- తమిళనాట మరో 5,495 మందికి పాజిటివ్‌గా తేలింది. ఒక్కరోజులో 76 మంది మృతి చెందగా.. 6,227 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో 4,97,066 మంది బాధితులు ఉండగా.. 8,307 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు.
- దిల్లీలో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా రికార్డు స్థాయిలో 4,321 కేసులను గుర్తించారు. దీంతో మొత్తం 2.14 లక్షల మంది వైరస్ బారిన పడ్డారు. 4,715 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఒడిశాలో తాజాగా 3,777 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. మరో 11 మంది మృతి చెందగా.. మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 616కు ఎగబాకింది. మొత్తం 1,46,894 మంది బాధితులు ఉన్నారు.
- కేరళలో కొత్తగా 2,885 కేసులు వెలుగు చూశాయి. రాష్ట్రంలో 28,802 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరో 75,848 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
- జమ్ముకశ్మీర్‌లో మరో 1,698 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. వీరిలో 838 మంది జమ్ములో, 860 మంది కశ్మీర్లో బయటపడ్డారు.
- బిహార్‌లో కొత్తగా 1,421 కేసులు వెలుగు చూశాయి. మరో 1700 మంది రికవరీ అయ్యారు. మొత్తం కేసుల సంఖ్య 1,56,866 ఉండగా.. అందులో 14,899 మంది చికిత్స పొందుతున్నారు.
- రాజస్థాన్‌లో మరో 739 మంది వైరస్ బారిన పడగా.. ఏడుగురు మరణించారు.
- త్రిపురలో మరో 559 మంది కరోనా బారినపడగా... మొత్తం 17,833 మంది వైరస్ బాధితులు ఉన్నట్లు గుర్తించారు. ఫలితంగా 172 మంది వైరస్‌కు బలయ్యారు.
- పుదుచ్చేరిలో తాజాగా నమోదైన కేసులతో కలిపి... మొత్తం 19,439 మంది బాధితులు ఉన్నారు. వీరిలో 14,238 మంది డిశ్చార్జ్ అయ్యారు.
- అసోం భాజపా ఎమ్మెల్యే అశోక్ శర్మకి కరోనా పాజిటివ్‌గా తేలింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 26 శాసనసభ్యులకు వైరస్ సోకింది. ఎమ్మెల్యేతో పాటు ఆయన సతీమణీ కూడా వైరస్ బారిన పడ్డారు.
Last Updated : Sep 12, 2020, 8:54 PM IST