తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మెట్రో నగరాల్లో తగ్గిన వైరస్​ ఉద్ధృతి.. కానీ! - కరోనా వైరస్​ మెట్రో నగరాలు

దేశంలో కరోనా​ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నప్పటికీ.. దిల్లీ, ముంబయి, చెన్నై వంటి మెట్రో నగరాల్లో వైరస్​ ఉద్ధృతి తగ్గినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో పట్టణాల్లో వైరస్​ వ్యాప్తి పెరుగుతున్నట్టు వెల్లడించాయి.

COVID-19 situation improving in metro cities; more cases reported from semi-urban areas: Sources
మెట్రో నగరాల్లో తగ్గినా.. పట్టణాల్లో ఆందోళనకరమే!

By

Published : Aug 29, 2020, 5:46 AM IST

మెట్రో నగరాలైన దిల్లీ, ముంబయి, చెన్నైలో కరోనా ఉద్ధృతి తగ్గుతోందని ప్రభుత్వ వర్గాల సమాచారం. అదే సమయంలో పట్టణాల్లో వైరస్​ వ్యాప్తి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది.

దేశంలో కరోనా కేసులు రికార్డుస్థాయిలో పెరుగుతున్నప్పటికీ.. మరణాల రేటు తక్కువగానే ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. దీనితో పాటు రికవరీల సంఖ్య దాదాపు 26లక్షలకు చేరుకున్నట్టు పేర్కొన్నారు.

"మెట్రో నగరాలైన దిల్లీ, ముంబయి, చెన్నైలలో పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. బెంగళూరు కూడా త్వరలో నియంత్రణలోకి వస్తుందని ఆశిస్తున్నాం. కానీ పట్టణాల్లో అధికంగా కేసులు నమోదవుతున్నాయి."

--- ప్రభుత్వ వర్గాలు.

మహారాష్ట్రలోని పింప్రి చించ్వాడ్​, సింగ్లి, సోలాపుర్​లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తమిళనాడులోని విరుధునగర్​, కర్ణాటకలోని బళ్లారిలోనూ కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉంది.

కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు విస్తృత చర్యలు చేపట్టాలని ఆయా ప్రాంతాల అధికారులకు కేంద్రం ఆదేశించినట్టు తెలుస్తోంది.

ఇవీ చూడండి:-

ABOUT THE AUTHOR

...view details