తెలంగాణ

telangana

ETV Bharat / bharat

34 లక్షలకు చేరువలో కరోనా రికవరీలు - corona cases in maharastra

దేశవ్యాప్తంగా దాదాపు 34 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో రికవరీ రేటు 77.77 శాతానికి చేరింది. అలాగే మరణాల రేటు 1.69గా ఉంది. మహారాష్ట్రలో కొత్తగా 23వేలకుపైగా కేసులు బయటపడ్డాయి. కర్ణాటక​లో తాజాగా 9,540 మంది కరోనా బారిన పడ్డారు.

COVID-19 recoveries near 34 lakh; five states contribute 61 pc of total active cases
దేశవ్యాప్తంగా 34 లక్షలకు చేరువలో కరోనా రికవరీలు

By

Published : Sep 9, 2020, 7:26 PM IST

Updated : Sep 9, 2020, 10:22 PM IST

దేశంలో కరోనా కేసులు నానాటికి పెరుగుతున్నప్పటికీ.. అదే స్థాయిలో రికవరీలు నమోదు కావటం ఊరటనిస్తోంది. మంగళవారం 74,894 మంది కోలుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 34 లక్షలకు చేరువైంది. రివకరీ రేటు 77.77 శాతంగా ఉంది. కోలుకున్న వారి సంఖ్య జులై మూడవ వారంలో 1,53,118గా ఉండగా సెప్టెంబర్ మొదటి వారంలో 4,84,068కి చేరింది. మరణాల రేటు 1.69 శాతంగా ఉంది.

మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఉత్తర్​ప్రదేశ్​, ఆంధ్రప్రదేశ్​ రాష్టాల నుంచే 61 శాతం యాక్టివ్​ కేసులు ఉన్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.

రాష్ట్రాల వారీగా కేసులు...

  • మహారాష్ట్రలో కరోనా విలయం కొనసాగుతోంది. ఒక్కరోజులో 23,816మందికి కరోనా సోకింది. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 9,67,349కి చేరింది. మరో 325మంది వైరస్​కు బలయ్యారు. అయితే ఒక్కరోజులో 13,960మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్​ అయ్యారు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా రికవరీల సంఖ్య 6,86,462కు చేరింది.
  • కర్ణాటకలో మరో 9,540 మంది కరోనా బారిన పడగా.. 128 మంది మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం 4,21,730 మంది బాధితులు ఉన్నారు. వీరిలో 3.15 లక్షల మంది డిశ్చార్జ్ కాగా.. దాదాపు లక్షల మంది చికిత్స పొందుతున్నారు.
  • ఉత్తరప్రదేశ్​లో తాజాగా 6,711 మంది కరోనా బారిన పడ్డారు. మరో 66 మంది మరణించగా.. మొత్తం 4,112 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2.16 లక్షల మంది కోలుకున్నారు. మరో 64 వేల మంది చికిత్స పొందుతున్నారు.
  • తమిళనాడులో తాజాగా 5,584 కేసులు వెలుగుచూశాయి. మరో 78 మంది మరణించగా... 6,516 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 4,80,524 మంది వైరస్​ బారిన పడ్డారు. 8,090 మంది వైరస్​కు బలయ్యారు.
  • ఇటీవల దిల్లీలో కరోనా తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా.. మళ్లీ కేసులు పెరగటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా రికార్డు స్థాయిలో 4,039 కేసులు వెలుగుచూశాయి. మరో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షలకు పైగా బాధితులు ఉన్నారు. ఫలితంగా 4,638 మంది మృతి చెందారు.
  • ఒడిశాలో కొత్తగా 3,748 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. దీంతో 1,35,130 మంది బాధితులు ఉన్నట్లు ఆ రాష్ట్ర అధికారులు తెలిపారు. తాజాగా మరణించిన వారితో కలిపి మృతుల సంఖ్య 580కి చేరింది.
  • కేరళలో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 3,402 మందికి పాజిటివ్​ నిర్ధరణ కాగా.. 12 మంది మృతి చెందారు.
  • ఝార్ఖండ్​లో కొత్తగా 2,652 మందికి కరోనా పాజిటివ్​గా తేలటం వల్ల.. మొత్తం బాధితుల సంఖ్య 55,296కు చేరింది. ఇప్పటివరకు 503 మంది మృతి చెందారు.
  • గుజరాత్​ వ్యాప్తంగా 1.08 లక్షల మంది కరోనా బారిన పడగా.. 3,152 మంది వైరస్​కు బలయ్యారు.
  • జమ్ముకశ్మీర్​లో 1,617 కరోనా కేసులను గుర్తించారు. వీటిలో 894 కశ్మీర్​లో, 723 జమ్ము ప్రాంతంలో వెలుగుచూశాయి.
  • బిహార్​లో తాజాగా నమోదైన కేసులతో కలిపి మొత్తం 1,52,192 బాధితులు ఉన్నారు. 775 మంది మృతి చెందారు.
  • హరియాణా విద్యాశాఖ మంత్రి కన్వర్ పాల్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్​ ద్వారా ప్రకటించారు.
Last Updated : Sep 9, 2020, 10:22 PM IST

ABOUT THE AUTHOR

...view details