తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైలు ప్రయాణికుల అడ్రెస్​లు నమోదు తప్పనిసరి! - రైల్వేశాఖ

రైల్వే శాఖ ఇకపై ప్రయాణికుల గమ్యస్థానాల చిరునామాలను రికార్డు చేయనుంది. కరోనా ఇన్ఫెక్షన్లు ప్రబలినప్పుడు... కాంటాక్ట్ ట్రేసింగ్ సులభతరం చేయడమే దీని వెనుకున్న ఉద్దేశం.

Railways now keeping record of destination address of passengers for contact tracing
రైలు ప్రయాణికుల చిరునామాలు రికార్డ్​ చేయడం తప్పనిసరి!

By

Published : May 14, 2020, 12:40 PM IST

ఐఆర్​సీటీసీ వైబ్​సైట్​లో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులందరి గమ్యస్థానాల చిరునామాల రికార్డులను రైల్వేశాఖ భద్రపరచనుంది. మే 13 నుంచి ఈ నిబంధనను అమలు చేస్తున్నారు. దీని వల్ల.. కరోనా ఇన్ఫెక్షన్లు ప్రబలినప్పుడు... కాంటాక్ట్ ట్రేసింగ్ సులభతరం అవుతుంది.

"రైలు ప్రయాణికుల గమ్యస్థానాల చిరునామాలను ఐఆర్​సీటీ రికార్డు చేస్తుంది. ఇది కాంటాక్ట్ ట్రేసింగ్​కు సహాయపడుతుంది. ఈ ఫీచర్ శాశ్వతంగా ఉంటుంది."

- ఆర్​.డి.బాజ్​పాయ్​, రైల్వేశాఖ అధికార ప్రతినిధి

కరోనా భయాల నేపథ్యంలో...

ఇంతకుముందు నమోదైన కనీసం 12 కేసుల్లో.... రైలు ప్రయాణం చేసిన వారికి కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే... ప్రయాణికుల చిరునామాలను రికార్డు చేయడం తప్పనిసరి చేశామని బాజ్​పాయ్ తెలిపారు.

ఇదీ చూడండి:ఇక ఉచితంగా 'ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్' పాఠాలు!

ABOUT THE AUTHOR

...view details