తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'దేశంలో ఏం జరిగినా ఇళ్లవద్దే ఉండండి'

కరోనాపై పోరాటానికి ప్రజలు చిత్తశుద్ధి నిరూపించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఏం జరిగినా ప్రజలు ఇళ్లవద్దే ఉండాలని కోరారు. కరోనా విస్తృతి నేపథ్యంలో జాతినుద్దేశించి ప్రసంగించారు మోదీ.

By

Published : Mar 24, 2020, 8:40 PM IST

modi
మోడీ

దేశంలో ఏం జరిగినా ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. ప్రధాని నుంచి గ్రామీణుల వరకు సామాజిక దూరం పాటించాలన్నారు.

ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ, సంయమనం పాటించి కరోనాపై పోరాటానికి మన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండాలని చేతులు జోడించి వేడుకుంటున్నట్లు పేర్కొన్నారు. దేశంలో కరోనా వ్యాప్తి పెరిగిపోతున్న నేపథ్యంలో జాతినుద్దేశించి ప్రధాని మాట్లాడారు. 21 రోజుల పాటు విధించే ఈ లాక్‌డౌన్‌.. మన ప్రాణాల కంటే ఎక్కువ కాదని ఉద్ఘాటించారు. కరోనా మహమ్మారిని భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంటుందనే నమ్మకం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఎంత ప్రమాదకరంగా విస్తరిస్తోందన్న విషయాన్ని మోదీ ఉదహరించారు. డబ్ల్యూహెచ్​ఓ గణాంకాల ప్రకారం లక్ష మందికి వైరస్ సోకేందుకు 67 రోజుల సమయం పట్టిందని పేర్కొన్నారు. లక్ష నుంచి రెండు లక్షల కేసులు నమోదు కావడానికి 11 రోజులు సమయం పడితే.. రెండు లక్షల నుంచి మూడు లక్షలకు చేరుకోవడానికి కేవలం 4 రోజులే పట్టిందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details