తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో కరోనాకు మరో ముగ్గురు బలి - దేశంలో 4,421కి చేరిన కరోనా కేసులు

భారత్​లో కరోనా కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి. కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం... దేశంలో ఇప్పటి వరకు 114 మంది కరోనాతో మరణించగా, మొత్తం కేసుల సంఖ్య 4,421కి చేరింది. మహారాష్ట్రలో అత్యధికంగా 45 కొవిడ్ మరణాలు సంభవించాయి.

COVID-19 LIVE: Death toll crosses 110 mark, total cases surge to 4,421
దేశంలో 114కి పెరిగిన కరోనా మరణాలు

By

Published : Apr 7, 2020, 11:12 AM IST

Updated : Apr 7, 2020, 12:24 PM IST

కరోనా మహమ్మారి భారత్​లో అంతకంతకూ విస్తరిస్తోంది. లాక్​డౌన్​ కొనసాగుతున్నా... వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. భారత్​లో ఇప్పటి వరకు 114 మంది కరోనా ధాటికి బలవ్వగా... మొత్తం​ కేసుల సంఖ్య 4,421కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.

"ప్రస్తుతం దేశంలో యాక్టివ్​ కేసుల సంఖ్య 3,981గా ఉంది. 325 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్​ అయ్యారు. మొత్తం కేసుల్లో 66 మంది విదేశీయులు కూడా ఉన్నారు." - కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ

కరోనా మరణమృదంగం

ఆరోగ్యమంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం... మహారాష్ట్రలో అత్యధికంగా 45 కరోనా మరణాలు సంభవించాయి. ఇవాళ రాజస్థాన్​లో ముగ్గురు వైరస్ సోకి మరణించారు. త్రిపురలో మొదటి కరోనా కేసు నమోదైంది.

భారత్​లో 114కు చేరుకున్న కరోనా మృతుల సంఖ్య

ఇదీ చూడండి:ఆ ఔషధం ఎగుమతులపై నిషేధం పాక్షికంగా ఎత్తివేత!

Last Updated : Apr 7, 2020, 12:24 PM IST

ABOUT THE AUTHOR

...view details