తెలంగాణ

telangana

By

Published : Apr 6, 2020, 8:57 PM IST

ETV Bharat / bharat

24 గంటల్లోనే దేశంలో 704 కేసులు... 28 మరణాలు

దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గంటగంటకూ పెరిగిపోతున్న కేసుల సంఖ్య.. భారత ప్రజల్ని తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. కరోనా మహమ్మారి ధాటికి ఇప్పటివరకు 111 మంది ప్రాణాలు కోల్పోగా.. 4,281 మంది వైరస్​ బారినపడ్డారు.

COVID-19 death toll rises to 111, number of cases to 4,281: Health Ministry
భారత్​పై కరోనా పంజా: 111 మరణాలు.. 4,281 కేసులు

భారత్​లో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. శరవేగంగా వ్యాపిస్తోన్న మహమ్మారి ధాటికి గత 24 గంటల్లో 704 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలోనే 28 మంది ఈ ప్రాణాంతక వైరస్​కు బలయ్యారు. ఫలితంగా మొత్తం మృతుల సంఖ్య 111కు చేరగా.. 4,821 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వైరస్​ బారినపడిన వారిలో 318 మంది కోలుకోగా.. ప్రస్తుతం 3851 యాక్టివ్​ కేసులున్నట్లు స్పష్టం చేసింది.

అక్కడే అధికం

మహారాష్ట్రపై కరోనా ప్రభావం అధికంగా కనిపిస్తోంది. నేడు మరణించిన 28 మందిలో.. 21 మంది ఆ రాష్ట్రం వారే కావడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మొత్తంగా రాష్ట్రంలో మృతుల సంఖ్య 52కు చేరినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

భారత్​లో కొవిడ్​ 19 మరణాలు

ఇదీ చదవండి:ఆ చిన్నారి కోసం... లాక్​డౌన్ నిబంధనలు సడలింపు

ABOUT THE AUTHOR

...view details