తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో ఆ వ్యాక్సిన్ ట్రయల్స్​కు గ్రీన్​ సిగ్నల్! - covid 19 vaccine trials in india

భారత్​లో ఆక్స్​ఫర్డ్​ కరోనా వ్యాక్సిన్ క్యాండిడెట్​ రెండు, మూడో దశల ప్రయోగానికి దేశీయ సీరమ్ సంస్థకు అనుమతులిచ్చింది డీసీజీఐ. ఈ దశలో దేశంలోని 17 వేరు వేరు ప్రాంతాల్లో 1600 మందిపై డోసులు ప్రయోగించనుంది సంస్థ.

COVID-19
మానవులపై వ్యాక్సిన్ ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్!

By

Published : Aug 3, 2020, 10:54 AM IST

Updated : Aug 3, 2020, 11:14 AM IST

ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం తయారుచేస్తున్న కరోనా వ్యాక్సిన్‌ రెండు, మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ)కుభారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అనుమతిచ్చింది.

తొలి దశ ప్రయోగ ఫలితాలు క్షుణ్నంగా పరిశీలించాకే అనుమతులిచ్చినట్లు తెలిపింది డీసీజీఐ. ఆక్స్​ఫర్డ్ వర్సిటీ శాస్త్రవేత్తలు అనుసరిస్తున్న ప్రయోగ విధానాన్నే.. సీరమ్ సంస్థ తయారు చేస్తున్న 'కొవిషీల్డ్' ప్రయోగంలోనూ పాటించనున్నారు.

రెండో దశ పూర్తి చేసుకన్నాక, మూడో దశ ప్రయోగం ప్రారంభించే ముందు డీసీజీఐకు భద్రత సమచారాన్ని సీరమ్ సమర్పించాల్సి ఉంటుంది. ఈ దశల్లో ఒక్క వ్యక్తిపై రెండు డోసులు ప్రయోగించాల్సి ఉంటుంది. మొదటి డోసు ఇచ్చిన 29వ రోజు రెండో డోసు వ్యాక్సిన్ ప్రయోగం జరగాలని వివరించింది డీసీజీఐ.

దేశంలోని 17 వేరు వేరు ప్రాంతాల్లో ఈ ప్రయోగం జరగునుంది. 18 ఏళ్లు నిండి, పూర్తి ఆరోగ్యంగా ఉన్న 1600 మందికి కోవిషీల్డ్ డోసులు ఇచ్చేందుకు అనుమతులు పొందింది సీరమ్.

ఇదీ చదవండి: యడియూరప్ప కూతురికి కరోనా.. ఆసుపత్రిలో సీఎం

Last Updated : Aug 3, 2020, 11:14 AM IST

ABOUT THE AUTHOR

...view details