కరోనాపై పోరుకు ప్రభుత్వ వైద్య సదుపాయాలు సరిపోవడం లేదన్న వార్తలు వస్తోన్న నేపథ్యంలో వైద్యరంగంలోని ప్రైవేటు సంస్థలను కరోనా సేవల కోసం ఏర్పాటు చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది కేంద్రం. వైద్య సదుపాయాలను సరైన ధరలకు అందించేలా చూడాలని సూచించింది.
ఆరోగ్య సదుపాయాల కొరత పెరిగిపోతుందని, ఐసీయూ సహా వివిధ వార్డుల్లో పడకలు సరిపోవడం లేదని కేంద్రానికి పలు నివేదికలు అందాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది కేంద్రం. వైరస్‌కు సేవలందించేందుకు ఎక్కువగా ఛార్జీ చేస్తున్నారనే అంశమై కూడా వార్తలు వచ్చాయి.