తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహారాష్ట్రలో రికార్డ్​ స్థాయిలో కేసులు- ఒక్కరోజులో 72 - corona latest cases and deaths

మహారాష్ట్రంలో కొత్తగా 72 మందికి కరోనా సోకింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 302 మంది ఈ మహమ్మారి బారినపడ్డారు. దేశవ్యాప్తంగా ఒక్కరోజులో అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రంగా నిలిచింది మహారాష్ట్ర.

COVID-19 cases in Maha jump to 302, biggest rise in single day
మహారాష్ట్రలో ఆగని కరోనా కేసులు.. ఒక్కరోజులోనే

By

Published : Mar 31, 2020, 8:34 PM IST

మహారాష్ట్రలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. మంగళవారం కొత్తగా 72 కేసులు నమోదయ్యాయి. ఒక్క ముంబయిలోనే అత్యధికంగా 52 మందికి వైరస్​ సోకింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 302 మంది ఈ మహమ్మారి బారినపడ్డారు.

దేశంలోనే ఒక్క రోజులో అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. ముంబయితో పాటు, అహ్మద్​నగర్​లో 3, పుణె, ఠానే, విసాయ్​, విరార్​, కల్యాణ్​- డొంబివాలి నగరాల్లో రెండు చొప్పున కేసులు నమోదయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details