తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉగ్ర సంస్థతో సంబంధాలున్న దంపతుల అరెస్ట్​! - దంపతుల అరెస్టు

ఓ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న దంపతులను దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేసేందుకు యువతను ప్రేరేపిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Couple arrested in Delhi
ఉగ్ర సంస్థతో సంబంధాలున్న దంపతుల అరెస్ట్​!

By

Published : Mar 8, 2020, 8:33 PM IST

Updated : Mar 8, 2020, 11:13 PM IST

ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్ర సంస్థతో సంబంధాలు ఉన్న దిల్లీకి చెందిన దంపతులను పోలీసులు అరెస్ట్​ చేశారు. దక్షిణ దిల్లీలోని జామియా నగర్‌కు చెందిన జహన్‌జెబ్‌ సామి, అతని భార్య హీనా బాషిర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయాలని యువతను రెచ్చగొడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయని తెలిపారు అధికారులు. దిల్లీలో ఆత్మాహుతి దాడికి వీరు ప్రణాళికలు రచిస్తున్నారని వెల్లడించారు. ఉగ్రదాడులు చేయాలని ముస్లిం యువతను ఉసిగొల్పుతున్నట్లు ఈ దంపతులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అఫ్గానిస్థాన్‌కు చెందిన సీనియర్‌ ఐసిస్‌ సభ్యులతో వీరు సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

పోలీసు కస్టడీకి

ఉగ్రసంస్థతో సంబంధాలు నెరుపుతున్న దంపతులు జహన్​జెబ్​ సమి, హీనా బాషిర్​లను ఈనెల 17వ తేదీ వరకు పోలీసు కస్టడీలో ఉంచాలని ఆదేశించింది దిల్లీ కోర్టు

ఇదీ చదవండి:'కరోనాను ఎదుర్కొనేందుకు సౌకర్యాలు పెంచండి'

Last Updated : Mar 8, 2020, 11:13 PM IST

ABOUT THE AUTHOR

...view details