తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కశ్మీర్​లో పర్యటించొద్దు.. ఉగ్రముప్పు ఉంది' - GERMANY

కశ్మీర్​లో పర్యటించొద్దని తమ దేశ పౌరులను బ్రిటన్​, ఆస్ట్రేలియా, జర్మనీ హెచ్చరించాయి. ఇప్పటికే కశ్మీర్​లో ఉన్న తమ దేశస్థులు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. జమ్ముకశ్మీర్​లో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి.

'ఉగ్రముప్పు ఉంది- కశ్మీర్​లో పర్యటించకండి'

By

Published : Aug 4, 2019, 5:00 AM IST

Updated : Aug 4, 2019, 7:57 AM IST

జమ్ముకశ్మీర్​లో నెలకొన్న తాజా పరిస్థితులు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. కశ్మీర్​లో భారీ బలగాల మోహరింపు, అమర్​నాథ్​ యాత్రికులకు హెచ్చరికలనేపథ్యంలో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా కశ్మీర్​లో పర్యటించొద్దంటూ బ్రిటన్​, జర్మనీ, ఆస్ట్రేలియా దేశాలు... తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేశాయి. ఉగ్రదాడుల ముప్పు పొంచి ఉందన్న భారత నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాయి.

"మీరు(బ్రిటన్​ పౌరులు) జమ్ముకశ్మీర్​లో ఉంటే అప్రమత్తంగా ఉండండి. స్థానిక యంత్రాంగం సూచనలను ఎప్పటికప్పుడు గమనించండి."
--- బ్రిటన్​ ప్రభుత్వ ప్రకటన.

జర్మనీ, ఆస్ట్రేలియా దేశాలూ తమ దేశస్థులకు ఇలాంటి సూచనలే చేశాయి. ఒంటరిగా ఎక్కడికీ వెళ్లొద్దని హెచ్చరించాయి.

"మీరు(ఆస్ట్రేలియా పౌరులు) ప్రయాణించాలనుకుంటే భద్రతా అంశాలపై అధిక దృష్టి సారించండి. సాధ్యమైనంత వరకు ఆ రాష్ట్రంలో పర్యటించకండి."
-- ఆస్ట్రేలియా ప్రభుత్వ ప్రకటన.

వారం రోజులుగా జమ్ముకశ్మీర్​కు భారీ సంఖ్యలో బలగాలను తరలిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ పరిస్థితులకు గల కారణాలపై ఇంకా ఎటువంటి స్పష్టత లేదు.

ఇదీ చూడండి- ఆపరేషన్​ కశ్మీర్​: భయాందోళనల్లో స్థానికులు

Last Updated : Aug 4, 2019, 7:57 AM IST

ABOUT THE AUTHOR

...view details