దేశంలో ఎన్నికల సమరం ముగిసింది. ఫలితాలు వెలువడ్డాయి. మళ్లీ భాజపా భారీ స్థాయిలో విజయం సాధించింది. 303 స్థానాల్లో విజయభేరి మోగించి పూర్తిస్థాయి ఆధిపత్యం సాధించింది. ఎన్డీఏతో కలిపి చూస్తే ఈ ఆధిక్యం 348కు చేరుకుంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి 86 స్థానాలతో సరిపెట్టుకుంది. స్థానిక పార్టీలు, స్వతంత్రులు కలిపి 108 స్థానాల్లో గెలుపొందారు.
యూపీఏ కూటమిలో కాంగ్రెస్ 52, డీఎంకే 23 స్థానాల్లో నెగ్గాయి. ఎన్డీఏలో భాజపా 303, శివసేన 18, జేడీ(యు) 16 స్థానాల్లో జయకేతనం ఎగురవేశాయి.
ఎన్డీఏ కూటమి - 348
- భాజపా - 303
- శివసేన - 18
- జేడీయూ - 16
- ఎల్జేపీ - 06
- శిరోమణి - 02
- అన్నాడీఎంకే - 01
- ఏడీ(ఎస్) - 01