తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​లో కరోనా..! చైనా నుంచి వచ్చిన ఇద్దరికి పరీక్షలు - karona virus in india

ప్రపంచమంతా కరోనా వైరస్ భయంతో వణికిపోతున్న తరుణంలో చైనా నుంచి వచ్చిన ఇద్దరికి ఈ వైరస్​ సోకిందన్న అనుమానంతో ముంబయిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీరిని ప్రత్యేక వార్డులో ఉంచారు.

coronavirus-two-under-watch-in-mumbai-special-ward-set-up
చైనా నుంచి వచ్చిన ఇద్దరికి ముంబయిలో కరోనా పరీక్షలు

By

Published : Jan 24, 2020, 1:03 PM IST

Updated : Feb 18, 2020, 5:37 AM IST

కరోనా వైరస్ సోకిందేమోనన్న అనుమానంతో చైనా నుంచి వచ్చిన ఇద్దరిని ముంబయిలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ముంబయి నగరపాలక అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. వైరస్ అనుమానితుల కోసం చించ్‌పోకాలీలోని కస్తూర్బా ఆస్పత్రిలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఇద్దరు దగ్గు, శ్వాససంబంధ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లు వివరించారు. వైరస్ సోకిందేమోనన్న అనుమానం వచ్చిన వారిని ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ ప్రత్యేక వార్డుకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.

Last Updated : Feb 18, 2020, 5:37 AM IST

ABOUT THE AUTHOR

...view details