మహారాష్ట్రలో కరోనా రికార్డు- కొత్తగా 7,862 కేసులు - TAMILANADU CORONA CASES
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో రోజురోజుకు కొత్త కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మహారాష్ట్రలో ఏకంగా 7 వేల 862 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 226 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో మరో 3,680 మంది వైరస్ బారిన పడ్డారు.
తమిళనాడులో ఆగని కరోనా ఉద్ధృతి
By
Published : Jul 10, 2020, 8:17 PM IST
|
Updated : Jul 10, 2020, 9:55 PM IST
దేశంలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో 7,862 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 226 మంది మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,38,461కి చేరింది. ఇప్పటి వరకు 9,893 మంది వైరస్‌కు బలయ్యారు. 1,32,625 మంది వైరస్ బారిన పడి కోలుకున్నారు.
దేశ రాజధానిలో...
దిల్లీలో కొత్తగా 2,089 కేసులు నమోదవగా, 42 మంది వైరస్‌కు బలయ్యారు. మొత్తం కేసుల సంఖ్య 1,09,140కి చేరింది. మరణాల సంఖ్య 3,300కు పెరిగింది.
తమిళనాడులో భారీగా...
తమిళనాడులో ఇవాళ 3,680 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 64 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 1,30,261కి, మరణాలు 1,829కి చేరాయి. ఇప్పటి వరకు 82,324 మంది వైరస్ నుంచి కోలుకోగా.. ప్రస్తుతం 46,105 మంది చికిత్స పొందుతున్నారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో..
ఉత్తర్‌ప్రదేశ్‌లో వైరస్ క్రమంగా విస్తరిస్తోంది. కొద్ది రోజులుగా వెయ్యికిపైగా కేసులు నమోదవుతున్నాయి. ఇవాళ కొత్తగా 1347 కేసులు బయటపడ్డాయి. 27 మంది ప్రాణాలు కోల్పోయారు. 660 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 21,787కి, మరణాలు 889కి చేరాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 11,204 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
గుజరాత్లో..
గుజరాత్లో వైరస్ విజృంభణ కొనసాగుతోంది. నేడు 875 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. 14 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 40,155కు చేరింది. మొత్తం 2,024 మంది ప్రాణాలు కోల్పోయారు.