ఒక్కరోజులో 19,459 కేసులు, 380 మరణాలు
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజాగా దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 19,459 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 380 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 5.48 లక్షలు దాటింది.
కరోనా పంజా
దేశంలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. తాజాగా దేశవ్యాప్తంగా ఒక్కరోజులోనే 19,459 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 380 మంది వైరస్‌కు బలయ్యారు.
- మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. మొత్తం కేసుల సంఖ్య 1,64,626కు చేరింది. 7,429 మంది ప్రాణాలు కోల్పోయారు. 8,6575 మంది కోలుకున్నారు.
- తమిళనాడులో రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 82,275కు చేరింది. 1079 మంది మృతి చెందారు. 35,659 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
- దిల్లీలో కేసుల సంఖ్య 83,077కి చేరింది. మొత్తం 2,623 మంది ప్రాణాలు కోల్పోయారు. 52,607 మంది వైరస్ నుంచి కోలుకోగా.. 27,847మంది చికిత్స పొందుతున్నారు.
- గుజరాత్లో వైరస్ కేసుల సంఖ్య 31,320కు చేరింది. ఇప్పటివరకు 1,808 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 6,712 మంది చికిత్స పొందుతున్నారు.
Last Updated : Jun 29, 2020, 9:32 AM IST