ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాకు ఆయుర్వేద మందు తీసుకువచ్చినట్లు ప్రముఖ దేశీయ కంపెనీ పతంజలి పేర్కొంది. 'కొరోనిల్' పేరుతో ఈ మందును మార్కెట్లోకి తీసుకువచ్చినట్లు ఆ సంస్థ సహ వ్యవస్థాపకులు బాబా రాందేవ్ తెలిపారు. హరిద్వార్‌లోని యోగ్‌పీఠ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ మందును ఆవిష్కరించారు.
"కరోనా మహమ్మారితో ప్రపంచదేశాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. ఇలాంటి విపత్కర సమయంలో మందు తీసుకురావడం ముఖ్యమైన ప్రక్రియ. ఆయుర్వేదంతో కరోనాను నయం చేయవచ్చు. ఈ మందుతో మూడు రోజుల పరిశీలనలో 69 శాతం మందికి నెగిటివ్ రావడం శుభసూచకం. అలాగే 7 రోజుల్లో వంద శాతం మంది కోలుకున్నారు. మందును తీసుకురావడంలో మా శాస్త్రవేత్తలు చేసిన కృషి అభినందనీయం"