దేశంలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. వైరస్ వ్యాప్తి రోజురోజుకూ తీవ్రమవుతోంది. తాజాగా దేశవ్యాప్తంగా ఒక్కరోజులోనే 19,906 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 410 మంది వైరస్‌కు బలయ్యారు. ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం.
దేశవ్యాప్తంగా కొత్తగా 19,906 కేసులు, 410 మరణాలు - Corona cases latest update
దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 19,906 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 410 మంది కరోనాకు బలయ్యారు.
దేశంలో 5 లక్షలు దాటిన కరోనా కేసులు
శనివారం(జూన్ 27) వరకు మొత్తం 82,27,802 నమూనాలను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన సంస్థ ఐసీఎంఆర్ తెలిపింది. అందులో 2,31,095 నమూనాలు ఒక్క శనివారమే పరీక్షించామని వెల్లడించింది.
- మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. మొత్తం కేసుల సంఖ్య 1,59,133కు చేరింది. 7,273మంది ప్రాణాలు కోల్పోయారు. 84,245మంది కోలుకున్నారు.
- తమిళనాడులో రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 78,335కు చేరింది. 1025 మంది మృతి చెందారు. 33,216యాక్టివ్ కేసులు ఉన్నాయి.
- దిల్లీలో కేసుల సంఖ్య 80,188కి చేరింది. మొత్తం 2,558 మంది ప్రాణాలు కోల్పోయారు. 49,301 మంది వైరస్ నుంచి కోలుకోగా.. 28,329మంది చికిత్స పొందుతున్నారు.
- గుజరాత్లో వైరస్ కేసుల సంఖ్య 30,095కు చేరింది. ఇప్పటివరకు 1,771 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 6,294 మంది చికిత్స పొందుతున్నారు.
Last Updated : Jun 28, 2020, 9:58 AM IST