తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉగ్రకుట్ర: ఆ దేశం నుంచి వచ్చినవారే టార్గెట్! - అల్​ఖైదా, ఇస్లామిక్​ ఉగ్ర సంస్థలు

భారత్​లో పర్యటించే యూదులు, ఇజ్రాయెల్​ వాసులపై దాడులు చేసేందుకు అల్​ఖైదా, ఇస్లామిక్​ ఉగ్ర సంస్థలు కుట్ర పన్నుతున్నాయి. యూదుల నూతన సంవత్సరం సహా సెలవురోజుల కారణంగా ఇజ్రాయెల్​ నుంచి వచ్చే వారే లక్ష్యంగా దాడులు చేసే అవకాశం ఉందని నిఘావర్గాలు హెచ్చరించాయి. అన్ని రాష్ట్రాలను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించాయి.

దేశంలో పర్యటించే యూదులు, ఇజ్రాయీలపై దాడులకు కుట్ర!

By

Published : Sep 26, 2019, 7:06 PM IST

Updated : Oct 2, 2019, 3:15 AM IST

దేశంలో పర్యటించే యూదులు, ఇజ్రాయెల్ వాసులే లక్ష్యంగా.. అల్‌ఖైదా, ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు దాడులు చేసే అవకాశముందని నిఘావర్గాలు హెచ్చరించాయి. సెప్టెంబర్, అక్టోబర్ మాసాలలో యూదుల నూతన సంవత్సరం సహా సెలవు రోజుల కారణంగా ఇజ్రాయెల్‌ నుంచి భారీ సంఖ్యలో యూదులు.. భారత్‌లో పలు ప్రాంతాల పర్యటనకు వచ్చే అవకాశముంది.

ఈ సందర్భంగా ఉగ్రవాద సంస్థలు.. ఆయా వర్గాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడే ప్రమాదముందని హెచ్చరికలు చేశాయి నిఘావర్గాలు.

ఆర్టికల్ 370 రద్దుకు ఇజ్రాయెల్ మద్దతు పలికిన నేపథ్యంలో దేశంలో పర్యటించే ఇజ్రాయెల్ వాసులపై దాడులకు కుట్ర పన్నుతున్నట్లు సమాచారం. దిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంపైనా దాడులకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇతర దేశాలకు చెందిన నిఘావర్గాల నుంచి కేంద్ర నిఘా విభాగాలకు సమాచారమందినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా రాష్ట్రాలకు నిఘావర్గాలు సూచించాయి.

ఇదీ చూడండి: 'కశ్మీర్​లో ఉగ్రవాదుల ఏరివేతను ముమ్మరం చేయండి'

Last Updated : Oct 2, 2019, 3:15 AM IST

ABOUT THE AUTHOR

...view details