తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎంపీలు రోజూ సమావేశం కావాలి: కాంగ్రెస్ విప్​ - కాంగ్రెస్ పార్టీ

ప్రతి పనిదినాన ఉదయం 10.30 గంటలకు పార్లమెంట్ భవనంలోని గది నెం.25లో కాంగ్రెస్ ఎంపీలు అందరూ సమావేశం కావాలని ఆ పార్టీ విప్​ జారీ చేసింది. పార్లమెంట్ సమావేశాల సమయాల్లో మాత్రం.. ప్రతి మంగళవారం ఉదయం 10.15 గంటలకు లోక్​సభ ఎంపీలందరూ భేటీ కావాలని మరో విప్​ జారీచేసింది కాంగ్రెస్ పార్టీ.

ఎంపీలు రోజూ సమావేశం కావాలి: కాంగ్రెస్ విప్​

By

Published : Jul 11, 2019, 5:17 AM IST

Updated : Jul 11, 2019, 7:36 AM IST

ఎంపీలు రోజూ సమావేశం కావాలి: కాంగ్రెస్ విప్​

పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలు, సభలో మాట్లాడాల్సిన అంశాలపై పూర్తి అవగాహన ఏర్పడటం కోసం కాంగ్రెస్​ తన సభ్యులకు ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేస్తోంది. పార్టీ ఎంపీలు ప్రతి పనిదినాన ఉదయం 10.30 గంటలకు పార్లమెంట్ భవనంలోని గది నెం.25లో సమావేశం కావాలని విప్​ జారీ చేసింది.

అలాగే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో... ఇదే గదిలో ప్రతి మంగళవారం ఉదయం 10.15 గంటలకు సమావేశం కావాలని కాంగ్రెస్ పార్టీ తన లోక్​సభ ఎంపీలందరికీ మరో విప్​ జారీచేసింది.

కొత్త విప్​లు

కాంగ్రెస్ పార్టీ... లోక్​సభలో పార్టీ విప్​లుగా గౌరవ్​ గొగొయి, మాణికం ఠాగూర్​లను బుధవారం నియమించింది. పార్టీ చీఫ్​ విప్​ కె.సురేష్​కు పార్లమెంటరీ వ్యవహారాల్లో సహాయంగా నిలుస్తారని తెలిపింది.

గౌరవ్ గొగొయి..​ అసోం నుంచి, మాణికం ఠాగూర్​... తమిళనాడు నుంచి లోక్​సభ ఎంపీలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

జూన్​ 17న మొదలైన పార్లమెంట్ బడ్జెట్​ సమావేశాలు.... జులై 26 వరకు కొనసాగనున్నాయి.

ఇదీ చూడండి: గోవా: భాజపాలో చేరిన 10 మంది కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు

Last Updated : Jul 11, 2019, 7:36 AM IST

ABOUT THE AUTHOR

...view details