తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పెట్రో మంట'పై కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళన! - కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాలు

దేశంలో పెట్రోల్​, డీజిల్ ధరల పెరుగుదలపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఇంధన ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని తీర్మానించింది. ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి కార్యాచరణ ప్రకటిస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​ తెలిపారు.

Congress
కాంగ్రెస్

By

Published : Jun 24, 2020, 4:47 AM IST

ఇంధన ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తీర్మానించారు. అయితే కరోనా నేపథ్యంలో సాధ్యాసాధ్యాలపై చర్చిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​ వెల్లడించారు.

"వరుసగా 17వ రోజు పెట్రోల్, డీజిల్​ ధరలను పెంచింది కేంద్రం. అంతేకాకుండా ఇప్పటికే డీజిల్​పై 820 శాతం, పెట్రోల్​పై 258 శాతం ఎక్సైజ్ సుంకాన్ని మోపింది. ఈ తరహా పెరుగుదలతో సామాన్యులపై తీవ్ర ప్రభావం పడుతుంది. కరోనా సంక్షోభ సమయంలో పెరుగుదల భారత ప్రజలపై మరింత భారం పడుతుంది.ఈ నేపథ్యంలో దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టాలని సీడబ్ల్యూసీలో తీర్మానించాం."

- కేసీ వేణుగోపాల్​

ఇంధన ధరల పెరుగుదలతో పాటు పలు అంశాలపై కేంద్రానికి సూచనలు చేసింది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ. జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిదినాలను 100 నుంచి 200లకు పెంచాలని కోరింది. పేదప్రజలకు ప్రత్యక్ష నగదు బదిలీ కింద ఆర్థిక సాయం చేయాలని సూచించింది.

ABOUT THE AUTHOR

...view details