తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన - haryana elections

మహారాష్ట్ర, హరియాణా శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అభ్యర్థుల ఎంపికను వేగవంతం చేసింది కాంగ్రెస్. మహారాష్ట్రలో 20 మందితో మూడో జాబితా విడుదల చేయగా హరియాణాలో ఒకేసారి 84 మంది అభ్యర్థులను ప్రకటించింది.

అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన

By

Published : Oct 3, 2019, 5:11 AM IST

అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన

మహారాష్ట్ర, హరియాణా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలను విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ. మహారాష్ట్రలో 20 మందితో మూడో జాబితాతో పాటు హరియాణాలో 84 మందిని ఒకేసారి ప్రకటించింది.

మహారాష్ట్రలో ఇప్పటి వరకు 3 జాబితాల్లో కలిపి మొత్తం 123 మంది అభ్యర్థులను ప్రకటించింది హస్తం పార్టీ. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలున్నాయి. మహా పోరులో నేషనలిస్ట్​ కాంగ్రెస్​ పార్టీతో జట్టుకట్టింది హస్తం.

హరియాణాలో మొత్తం 90 స్థానాలు ఉండగా తొలి జాబితాలో ఒకేసారి 84 మంది అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్​. 17 మంది సిట్టింగ్​ ఎమ్మెల్యేలలో ఒకరిని మినహాయించి 16 మందిని బరిలోకి దింపింది.
రెండు రాష్ట్రాలకు ఈ నెల 21న ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు ఇదే నెల 24న వెలువడుతాయి.

ఇదీ చూడండి: మహా పోరు: 52 మందితో కాంగ్రెస్ రెండో జాబితా

ABOUT THE AUTHOR

...view details