కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తనయుడు, కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరానికి సోమవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు. అయితే కరోనా లక్షణాలు మాత్రం స్వల్పంగా ఉన్నాయని తెలిపారు.
కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరానికి కరోనా పాజిటివ్ - కరోనా తాజా వార్తలు
కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని.. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలిపారు.
‘నిర్ధారణ పరీక్షల్లో నాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. కాకపోతే స్వల్ప లక్షణాలు కనిపిస్తుండటంతో వైద్యుల సూచన మేరకు హోం క్వారంటైన్‌లో ఉన్నాను. ఇటీవల నన్ను కలిసిన వారంతా వైద్యుల సూచనలు పాటించాలని కోరుతున్నాను’ అని కార్తి ట్వీట్ చేశారు.
గత కొద్ది రోజులుగా ప్రముఖ రాజకీయ నాయకులు వైరస్ బారినపడుతున్నారు. వారిలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కర్ణాటక, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు యడియూరప్ప, శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నారు. లక్షణాలు కనిపిస్తే దాచకుండా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని చౌహాన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.