తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తున్నారు: రాహుల్‌గాంధీ

Congress leader Rahul Gandhi meets senior party leaders & MPs at party headquarters to meet with Ramnath Kovind
రాష్ట్రపతిని కలిసేందుకు కాంగ్రెస్​ బృందం ర్యాలీ

By

Published : Dec 24, 2020, 11:16 AM IST

Updated : Dec 24, 2020, 12:41 PM IST

12:40 December 24

  • రైతులు చట్టబద్ధంగానే నిరసనలు తెలుపుతున్నారు: రాహుల్‌గాంధీ
  • పార్లమెంట్‌ ఉభయసభలను సమావేశపరిచి సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలి: రాహుల్
  • సాగు చట్టాలను తప్పుడు పద్ధతుల్లో ఆమోదింపజేసుకున్నారు: రాహుల్‌గాంధీ
  • ముగ్గురమే రాష్ట్రపతిని కలిసినా కోట్లమంది సంతకాలను తీసుకెళ్లాం: రాహుల్‌
  • చట్టాలను ప్రధాని వెనక్కితీసుకోకపోతే దేశం ఇబ్బందుల్లో పడుతుంది: రాహుల్‌
  • ప్రధాని రైతుల కోసం కాకుండా కార్పొరేట్ల కోసం పనిచేస్తున్నారు: రాహుల్‌
  • ఇద్దరు, ముగ్గురు పారిశ్రామికవేత్తల కోసం దేశాన్ని కష్టాల్లోకి నెడుతున్నారు: రాహుల్‌
  • దేశంలో వ్యవసాయ రంగంపైనే కోట్లమంది ఉపాధి ఆధారపడి ఉంది: రాహుల్‌
  • దేశంలో పెనువిధ్వంసానికి దారితీసే నిర్ణయాలు తీసుకుంటున్నారు: రాహుల్‌
  • మోదీ నిర్ణయాలతో కోట్లమంది జీవితాలు రోడ్డున పడుతున్నాయి: రాహుల్
  • వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తున్నారు: రాహుల్‌గాంధీ
  • వేలమందిని కరోనా బలి తీసుకున్నా ప్రధాని ఏమీ చేయలేకపోయారు: రాహుల్
  • ప్రభుత్వ నిర్ణయాలపై గళమెత్తే వారిని తీవ్రవాదులుగా చిత్రీకరిస్తున్నారు: రాహుల్
  • సరిహద్దుల్లో చైనా వేల కిలోమీటర్లు ఆక్రమించుకుంటే మౌనమెందుకు?: రాహుల్
  • దేశం ప్రమాదకరమైన మార్గంలో ప్రయాణిస్తోంది: రాహుల్‌గాంధీ
  • దేశంలో ప్రజాస్వామ్యం ఊహల్లోనే ఉంది.. వాస్తవంలో లేదు: రాహుల్‌గాంధీ

12:20 December 24

మందిర్​ మార్గ్​ పోలీస్​ స్టేషన్​కు ప్రియాంక గాంధీ తరలింపు

ప్రియాంక గాంధీ సహా.. ఇతర పార్టీ నాయకులను దిల్లీలోని మందిర్​ మార్గ్​ పోలీస్​ స్టేషన్​కు తరలించారు పోలీసులు.

11:53 December 24

ప్రియాంకా గాంధీ అరెస్ట్​

కాంగ్రెస్​ చేపట్టిన ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.. పార్టీ నేత ప్రియాంక గాంధీ సహా నాయకులను అరెస్ట్​ చేశారు.

11:42 December 24

కాంగ్రెస్​ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

నూతన సాగు చట్టాలపై రాష్ట్రపతిని కలిసిన కాంగ్రెస్ బృందం

  • రాహుల్‌గాంధీ నేతృత్వంలో రాష్ట్రపతిని కలిసిన కాంగ్రెస్ బృందం
  • నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపట్టిన కాంగ్రెస్
  • సంతకాల పత్రాలతో కూడిన వినతిపత్రాన్ని రాష్ట్రపతికి అందజేసిన రాహుల్‌
  • కూలీలు, రైతులు, వ్యాపారుల నుంచి 2 కోట్ల సంతకాలు సేకరించిన కాంగ్రెస్
  • సాగు చట్టాల రద్దుకు జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతిని కోరిన కాంగ్రెస్ నేతలు
  • రాష్ట్రపతిని కలిసిన రాహుల్, అధిర్‌ రంజన్ చౌదరి, గులాం నబీ ఆజాద్‌

10:52 December 24

రాష్ట్రపతిని కలిసేందుకు కాంగ్రెస్​ బృందం ర్యాలీ

రాష్ట్రపతిని కలిసేందుకు ర్యాలీగా బయల్దేరిన కాంగ్రెస్​ బృందం

నూతన సాగు చట్టాల విషయంలో జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కోరనున్నారు కాంగ్రెస్ నాయకులు. ఇందుకోసం కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ.. పార్టీ సీనియర్​ నాయకులు, ఎంపీలను పార్టీ ప్రధాన కార్యాలయంలో కలిశారు. అనంతరం.. దిల్లీలోని విజయ్ చౌక్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఈ బృందం ర్యాలీగా వెళ్లి.. రాష్ట్రపతిని కలవనుంది. ఈ కవాతుకు రాహుల్​ నాయకత్వం వహించనున్నారు.

కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా.. దేశవ్యాప్తంగా 2 కోట్ల సంతకాలను సేకరించింది కాంగ్రెస్. సంబంధిత పత్రాలతో కూడిన వినతి పత్రాన్ని కాంగ్రెస్​ బృందం రాష్ట్రపతికి అందజేయనుంది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతుల ఆవేదనను అర్థం చేసుకోవాలని కోవింద్‌ను అభ్యర్థించనున్నారని సమాచారం.

ఇదీ చదవండి:కేంద్ర కేబినెట్​ కీలక నిర్ణయాలు ఇవే

Last Updated : Dec 24, 2020, 12:41 PM IST

ABOUT THE AUTHOR

...view details